కరోనా నేపథ్యంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి ఏటా సెప్టెంబర్ 30న నిర్వహించే వార్షిక సాధారణ సమావేశం(ఏజీఎమ్)... ఈ ఏడాది నిరవధికంగా వాయిదా వేసింది. ఈ అంశంపై అన్ని రాష్ట్ర సంఘాలకు సమాచారం ఇచ్చారు బీసీసీఐ సెక్రటరీ జైషా. తమిళనాడు సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్-1975 ప్రకారం బోర్డు రిజిస్ట్రేషన్ కావడం వల్ల ప్రతి ఏటా ఏజీఎమ్ నిర్వహించాల్సి ఉంటుంది.
బీసీసీఐ వార్షిక సమావేశం నిరవధిక వాయిదా - bcci agm meeting news
ఈ ఏడాది సెప్టెంబర్లో జరగాల్సిన బీసీసీఐ వార్షిక సాధారణ సమావేశం(ఏజీఎమ్) నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు బీసీసీఐ సెక్రటరీ జైషా. ఈ మేరకు అన్ని రాష్ట్ర సంఘాలకు లేఖలు పంపినట్లు తెలుస్తోంది.
బీసీసీఐ వార్షిక సమావేశం నిరవధిక వాయిదా
ఈ చట్టం ప్రకారం ఆన్లైన్ ద్వారా బోర్డు వార్షిక సమావేశం నిర్వహించేందుకు వీలు లేదని జైషా పేర్కొన్నారు. వాయిదా పడిన ఈ సమావేశం ఈ ఏడాది డిసెంబర్లోగా నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ సమావేశం మాత్రం వర్చువల్గా జరగనుంది.