తెలంగాణ

telangana

ETV Bharat / sports

విరుద్ధ ప్రయోజానాలు: శాంతా రంగస్వామి, అన్షుమన్‌కు క్లీన్​చిట్​ - CAC members

క్రికెట్‌ సలహా కమిటీ(సీఏఏ) మాజీ సభ్యులు శాంత రంగస్వామి, అన్షుమన్​ గైక్వాడ్​లకు బీసీసీఐ ఎథిక్స్​ అధికారి డీకే జైన్​ క్లీన్​చిట్​ ఇచ్చారు. వీరిద్దరూ విరుద్ధ ప్రయోజనాల అంశంలో లేరని స్పష్టత చేశారు. ఈ మాజీ క్రికెటర్లిద్దరూ గతంలో.. టీమిండియా ప్రధాన కోచ్​గా రవిశాస్త్రి ఎంపిక చేసే విషయంలో కీలకపాత్ర పోషించారు.

D. K. Jain rendered the conflict of interest complaint against former CAC members Shantha Rangaswamy and Anshuman Gaekwad
శాంతా రంగస్వామి, అన్షుమన్‌కు క్లీన్​చిట్​

By

Published : Dec 29, 2019, 1:28 PM IST

టీమిండియా మహిళా జట్టు మాజీ సారథి, క్రికెట్‌ సలహా కమిటీ మాజీ సభ్యురాలు శాంత రంగస్వామి, మరో సభ్యుడు అన్షుమన్​ గైక్వాడ్​కు ఊరట లభించింది. విరుద్ధ ప్రయోజనాల అంశంలో వీరిద్దరికీ భాగస్వామ్యం లేదన్నారు బీసీసీఐ ఎథిక్స్‌ అధికారి డీకే జైన్‌. ఈ శనివారం(డిసెంబరు 28) జరిగిన విచారణ తర్వాత ఈ విషయంపై స్పష్టత నిచ్చారు జైన్‌. ఇటీవలే వీరిద్దరూ క్రికెట్‌ సలహా కమిటీ (సీఏసీ), భారత క్రికెటర్ల సంఘం (ఐపీఏ) పదవుల నుంచి వైదొలగడం వల్ల ఈ కేసు నుంచి ఉపశమనం లభించినట్లయిందని చెప్పారు.

కపిల్‌దేవ్‌కు మాత్రం ఇంకా ఈ విషయంలో పూర్తిగా ఊరట లభించలేదు. ఫిర్యాదుదారుడు సంజీవ్​ గుప్తా మరో దరఖాస్తు చేయాలనుకోవడం వల్ల తీర్పు ఆలస్యం కానుంది. ఇప్పటికే కపిల్.. విచారణకు హాజరయ్యాడు. బీసీసీఐలోఏ వ్యక్తయినా, రెండు లాభాదాయక పదవుల్లో ఉంటే ఈ విరుద్ధ ప్రయోజనం కిందకు వస్తారు. వారిపై తగిన చర్యలు తీసుకునేందుకు పూర్తి హక్కులు బీసీసీఐ ఎథిక్స్​ అధికారికి ఉంటాయి.

కోచ్​ ఎంపికలో కీలకపాత్ర

గతంలో కపిల్‌దేవ్‌‌, అన్షుమన్‌‌, శాంత రంగస్వామి... క్రికెట్‌ సలహా కమిటీ సభ్యులుగా ఉన్నారు. ప్రస్తుత టీమిండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రిని రెండోసారి ఆ పదవికి ఎంపిక చేసిందీ కమిటీయే. అనంతరం పరస్పర విరుద్ధ ప్రయోజనాలను పొందుతున్నారని వీరిపై మధ్యప్రదేశ్‌ క్రికెట్ సంఘం జీవితకాల సభ్యుడు సంజీవ్‌ గుప్తా ఫిర్యాదు చేశారు. ఫలితంగా ఈ ముగ్గురు తమ పదవులకు రాజీనామా చేశారు.

ABOUT THE AUTHOR

...view details