తెలంగాణ

telangana

ETV Bharat / sports

అక్టోబర్​ 22న బీసీసీఐ ఎన్నికలు :  సీఓఏ

బీసీసీఐ​ పాలకుల కమిటీ (సీఓఏ) మంగళవారం కీలక నిర్ణయం ప్రకటించింది. అక్టోబర్​ 22న బీసీసీఐ పాలకమండలికి ఎన్నికలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది.

అక్టోబర్​ 22న బీసీసీఐ ఎన్నికలు :  సీఓఏ

By

Published : May 21, 2019, 6:24 PM IST

బీసీసీఐకి ఎన్నిక‌లు అక్టోబ‌ర్ 22న జ‌ర‌గ‌నున్నాయి. సుప్రీం కోర్టు నియమించిన బీసీసీఐ పాలకుల కమిటీ ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది. జస్టిస్‌ ఆర్‌ఎం లోధా కమిటీ సంస్కరణలు అమలు చేసేందుకు సుప్రీం కోర్టు 2017 జనవరిలో ఐదుగురు సభ్యులతో సీఓఏని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. గ‌త రెండేళ్లుగా బీసీసీఐ కార్యకలాపాలను సీఓఏనే చూసుకుంటుంది.

సుప్రీం కోర్టు నియమించిన అమికస్‌ క్యూరీ నరసింహతో విస్తృత చర్చల తర్వాత సీఓఏ ఈ నిర్ణయం ప్రకటించింది. ప్ర‌జాస్వామ్యబ‌ద్దంగా ఎన్నికైన స‌భ్యుల‌తో బీసీసీఐ బోర్డు నిర్వ‌హ‌ణ జ‌రుగుతుంద‌న్న న‌మ్మ‌కాన్ని అమికస్ క్యూరి పీఎస్ న‌ర్సింహా క‌మిటీ వ్య‌క్తం చేసింది. ఇందులో భాగంగా అన్ని రాష్ట్రాల క్రికెట్ సంఘాల‌తో చ‌ర్చించి ఆయన తన నివేదికను స‌మ‌ర్పించారు.

రాష్ట్ర సంఘాల ఎన్నికలు సెప్టెంబర్‌ 30 లోపు పూర్తిచేయాలని పేర్కొన్నారు. లోధా సిఫార్సులను 30 రాష్ట్ర సంఘాలు అమలు చేశాయని, మిగతావి తమ రాజ్యంగాలను మారుస్తున్నాయని వినోద్ రాయ్‌ వెల్లడించారు. బీసీసీఐకి ఎన్నికలు నిర్వహిస్తున్నందుకు సంతోషంగా ఉందని ఆయన చెప్పారు.

" సుప్రీం కోర్టు మమ్మల్ని నియమించినప్పుడు నా పాత్ర నైట్‌ వాచ్‌మన్‌ లాంటిదని చెప్పా. కానీ ఈ నైట్‌ వాచ్‌మన్‌ చాలా ఎక్కువ రోజులే ఉన్నాడు. మాకు అప్పగించిన పని ప్రత్యేకమైనది కాబట్టి సంతోషంగా ఉన్నాం. బీసీసీఐ, రాష్ట్ర సంఘాలు కొత్త రాజ్యంగాన్ని ఆమోదించడం తప్పనిసరి. మాతో, అమికస్‌ క్యూరీ, కోర్టుతో వారికి ఇబ్బందులు ఎదురయ్యాయి. చివరికి వారికి బాధ్యతలు అప్పగిస్తున్నందుకు ఆనందంగా ఉంది. ప్రజాస్వామ్య బద్ధంగా ఎంపికైన కమిటీ దేశంలో క్రికెట్‌ పాలన చేపట్టాలని మేం కోరుకుంటున్నాం"
-- వినోద్‌రాయ్‌, క్రికెట్​ పాలకుల సంఘం చీఫ్‌

గతంలో ఐదుగురితో...

గతంలో జస్టిస్‌ ఆర్‌ఎం లోధా కమిటీ సంస్కరణలు అమలు చేసేందుకు సుప్రీం కోర్టు 2017 జనవరిలో ఐదుగురు సభ్యులతో సీఓఏని ఏర్పాటు చేసింది. వివిధ రాష్ట్ర సంఘాలు దాఖలు చేసిన 80 మధ్యంతర అప్పీళ్లను పరిష్కరించేందుకు... మార్చిలో అమికస్​ క్యూరీగా నరసింహను అత్యున్నత న్యాయస్థానం నియమించింది.

ABOUT THE AUTHOR

...view details