ధోనీకి భారత క్రికెట్ బోర్డు సరైన వీడ్కోలు ఇవ్వలేదని పాక్ మాజీ క్రికెటర్ సక్లైన్ ముస్తాక్ అభిప్రాయపడ్డాడు. కోట్లాదిమంది అభిమానులు కూడా దీనినే కోరుకుంటున్నారని చెప్పాడు. ఇలా అన్నందుకు బీసీసీఐకి క్షమాపణలు తెలిపాడీ బౌలర్.
ధోనీ వీడ్కోలు.. బీసీసీఐ అలా చేయడమేంటి? - dhoni bcci new
ధోనీ వీడ్కోలు మ్యాచ్ విషయమై బీసీసీఐ సరిగ్గా వ్యవహరించలేదని అన్నాడు పాక్ మాజీ బౌలర్ సక్లైన్ ముస్తాక్. అభిమానులందరూ అతడి చివరి మ్యాచ్ చూడాలనుకుంటున్నారని చెప్పాడు.
"ప్రతి ఆటగాడికి ఇలాంటి రోజు వస్తుంది. అప్పుడు ఆటకు వీడ్కోలు చెప్పక తప్పదు. ధోనీ నా ఆరాధ్య క్రికెటర్ కాకుండా గొప్ప ఫినిషర్, పోరాడే నాయకుడు, నిరాడంబర వ్యక్తి. అతడు సామాన్యమైన ఆటగాడు కాదు నూటికి ఒక్కడు. ధోనీ పేరు, గౌరవం అలా నిలిచిపోతాయి. అతడిని అభిమానించే వాళ్లందరూ ధోనీ చివరి మ్యాచ్‌ను చూడాలనుకుంటున్నారు. ఈ విషయంలో భారత క్రికెట్ బోర్డు సరిగ్గా వ్యవహరించలేదు. ఇలా అన్నందుకు వారికి క్షమాపణలు కూడా చెబుతున్నాను. ప్రతి క్రికెటర్ గొప్పగా వీడ్కోలు పలకాలని అనుకుంటాడు. ధోనీ దీనికేమి అతీతుడు కాదు" -సక్లైన్ ముస్తాక్, పాక్ మాజీ క్రికెటర్
గతేడాది ప్రపంచకప్ సెమీస్‌లో చివరగా ఆడిన ధోనీ.. ఇటీవలే ఆగస్టు 15న అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. ఐపీఎల్లో మాత్రం 2022 వరకు ఆడనున్నాడు.