తెలంగాణ

telangana

ETV Bharat / sports

రోహిత్​ శర్మకు బీసీసీఐ అభినందనలు - బీసీసీఐ రోహిత్​

దేశ అత్యున్నత క్రీడా పురస్కారం ఖేల్​రత్న అందుకోనున్న టీమ్​ఇండియా ఓపెనర్​ రోహిత్​ శర్మకు అభినందనలు తెలిపింది బీసీసీఐ. దీంతో పాటు అర్జున అవార్డును తీసుకోనున్న పేసర్​ ఇషాంత్​ శర్మ, మహిళా క్రికెటర్​ దీప్తి శర్మను ప్రశంసించింది.

BCCI
రోహిత్​ శర్మకు బీసీసీఐ ధన్యావాదాలు

By

Published : Aug 22, 2020, 10:51 AM IST

టీమ్​ఇండియా ఓపెనర్​ రోహిత్​ శర్మ.. దేశ అత్యున్నత క్రీడా పురస్కారం ఖేల్​రత్న అవార్డును అందుకోనున్నాడు. ఈ నేపథ్యంలో దీనిపై బీసీసీఐ స్పందించింది. అతడికి అభినందనలు తెలిపింది.

అర్జున అవార్డు అందుకోనున్న టీమ్​ఇండియా పేసర్​ ఇషాంత్​ శర్మ, మహిళా జట్టు క్రికెటర్​ దీప్తి శర్మకు కూడా శుభాకాంక్షలు తెలుపుతూ.. కెరీర్​లో మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించింది.

గతంలో క్రికెట్​లో ఖేల్​రత్నను సచిన్​ తెందూల్కర్​, మహేంద్రసింగ్ ధోనీ సహా సారథి విరాట్​ కోహ్లీ అందుకున్నారు.

క్రికెటర్లు ఇషాంత్​ శర్మ, దీప్తి శర్మతో పాటు అథ్లెట్​ ద్యుతి చంద్​, షూటర్​ మను బాకర్​ సహా 27 మంది క్రీడాకారులు అర్జున అవార్డు సొంతం చేసుకోనున్నారు. వీటిని ఆగస్టు 29 జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా వర్చువల్ విధానంలో అందజేయనున్నారు.

ఖేల్​రత్న పురస్కార గ్రహీతలు

ఇది చూడండి స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మకు 'ఖేల్​రత్న' అవార్డు

ABOUT THE AUTHOR

...view details