పరిమిత ఓవర్ల క్రికెట్లో టీమిండియా ఆటగాడు కేఎల్ రాహుల్ అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టీ20లోనూ అదరగొట్టాడు. అతడి ప్రదర్శన, ఫామ్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ. సుదీర్ఘ ఫార్మాట్‌లోనూ అతడు ఇదే జోరు కొనసాగిస్తాడని ధీమా వ్యక్తం చేశాడు. అనంతరం న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లో పంత్‌కు తుది జట్టులో చోటు దక్కకపోవడంపైనా స్పందించాడు దాదా.
" ప్రస్తుతం జట్టు యాజమాన్యం ఇచ్చిన ప్రతి పాత్రను రాహుల్ సమర్థంగా పోషిస్తున్నాడు. బ్యాట్స్‌మెన్‌గా ఏ స్థానంలోనైనా పరుగులు చేస్తూ వికెట్ కీపింగ్‌లోనూ రాణిస్తున్నాడు. కేఎల్ రాహుల్ పాత్రను జట్టు యాజమాన్యం, సారథి నిర్ణయిస్తారు. వన్డేలు, టీ20ల్లో రాహుల్ చాలా బాగా ఆడుతున్నాడు. టెస్టు క్రికెట్‌నూ అతడు చక్కగా ఆడేవాడు. ఆ తర్వాత నెమ్మదించాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో మాత్రం నమ్మకం నిలబెట్టుకున్నాడు. అతడిలాగే సాగిపోవాలని కోరుకుంటున్నా. పంత్‌ను ఎంపికచేయకపోవడం వంటి నిర్ణయాలన్నీ జట్టు యాజమాన్యం తీసుకుంటుంది".