తెలంగాణ

telangana

ETV Bharat / sports

జడ్డూ.. సరిలేరు నీకెవ్వరు: గంగూలీ - Jadeja Praises By Ganguly

వెస్టిండీస్​పై వన్డే సిరీస్​ గెలిచిన టీమిండియాను భారత మాజీ ఆటగాళ్లు ప్రశంసించారు. ఇరుజట్లు విజయం కోసం చేసిన పోరాటం ఆసక్తి కలిగించిందని అన్నారు.

BCCI chief Sourav Ganguly delighted with Ravindra Jadeja
జడేజా

By

Published : Dec 23, 2019, 7:59 PM IST

ఆదివారం జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేలో టీమిండియా ప్రదర్శనపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్​ గంగూలీ​ ఆనందం వ్యక్తం చేశాడు. ఛేదనలో ఆల్​రౌండర్​ రవీంద్ర జడేజా అత్యుత్త్తమ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడని దాదా అన్నాడు. గంగూలీతో పాటు ఇతర మాజీ ఆటగాళ్లు కూడా భారత జట్టును కొనియాడారు.

ఒత్తిడిని అధిగమించి విజయాన్ని సాధించిన టీమిండియాకు అభినందనలు. రవీంద్ర జడేజా బ్యాటింగ్​లో​ చాలా మెరుగయ్యాడు. ఈ ఫామ్​ను ఇలాగే కొనసాగించటం జట్టుకు చాలా అవసరం. -సౌరభ్​ గంగూలీ,బీసీసీఐ అధ్యక్షుడు.

వన్డే సిరీస్​ను గెలిచిన టీమిండియాకు అభినందనలు. జట్టు ప్రదర్శన అంతా బాగుంది. విజయాల పరంపరను ఇలాగే కొనసాగించండి. - సచిన్​ తెందూల్కర్​

టీమిండియాకు అభినందనలు. రోహిత్​, రాహుల్​, కోహ్లీ, జడేజా, శార్దూల్​ ఠాకూర్​ ఈ సిరీస్​లో​ అత్యుత్తమ​ ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. వెస్టిండీస్​ జట్టు కూడా అద్భుతంగా ఆడింది. -హర్భజన్​ సింగ్​.

శార్దూల్​ ఠాకూర్​, రవీంద్ర జడేజా అద్భుతంగా పోరాడి టీమిండియాకు విజయాన్నందించారు. వెస్టిండీస్ జట్టు కూడా చివరి వరకు బాగా పోరాడింది. -వీవీఎస్ లక్ష్మణ్

ఆదివారం విండీస్​తో జరిగిన మూడో వన్డేలో నెగ్గి 2-1 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది టీమిండియా. ఈ మ్యాచ్​లో భారత్ విజయం దిశగా దూసుకెళ్తున్న సమయంలో 85 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అనూహ్యంగా కోహ్లీ ఔటయ్యాడు. ఆ తర్వాత క్రీజ్​లోకి వచ్చిన శార్దూల్ ఠాకూర్, జడేజా అద్భుతంగా పోరాడి భారత్​ను విజయతీరాలకు చేర్చారు.

ఇదీ చదవండి: పంత్​కు ప్రత్యేక కోచింగ్ అవసరం: ఎమ్మెస్కే

ABOUT THE AUTHOR

...view details