బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అస్వస్థతకు గురయ్యారు. కోల్‌కతాలోని వుడ్‌ల్యాండ్ ఆసుపత్రిలో చేరారు. ఛాతిలో నొప్పి కారణంగా 48 ఏళ్ల దాదా శనివారం ఉదయం ఆసుపత్రిలో చేరినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని అన్నారు.
ఛాతినొప్పితో ఆస్పత్రిలో చేరిన బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ - sourav ganguly
గుండె సంబంధిత సమస్యతో మాజీ క్రికెటర్ గంగూలీ కోల్‌కతాలోని ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.
గుండెకు సమస్య.. ఆస్పత్రిలో మాజీ క్రికెటర్ గంగూలీ
శుక్రవారం సాయంత్రం గంగూలీ వ్యాయామం చేస్తుండగా ఛాతిలో నొప్పితో అసౌకర్యానికి గురయ్యారు. ఈరోజు మధ్యాహ్నం కూడా ఆయన ఇబ్బంది పడటం వల్ల కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రిలో చేర్చారు. "ప్రస్తుతం గంగూలీ ఆరోగ్యం నిలకడగానే ఉంది. గుండెకు సంబంధించిన ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా లేదా అని పరిశీలిస్తున్నాం. ఆయనకు కొన్ని పరీక్షలు చేయాల్సి ఉంది" అని వైద్యులు తెలిపారు.
Last Updated : Jan 2, 2021, 2:41 PM IST