బయోబబుల్‌లో దీర్ఘకాలం ఉంటూ క్రికెట్ ఆడటం కష్టమని బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ అభిప్రాయపడ్డాడు. ఇలాంటి కఠిన పరిస్థితుల్లో ఐపీఎల్‌ను విజయవంతం చేసిన ఆటగాళ్లకు అతను కృతజ్ఞతలు చెప్పాడు.
"బీసీసీఐ తరఫున ప్రతి ఐపీఎల్ జట్టులోని ఆటగాళ్లకూ ధన్యవాదాలు. బబుల్‌లో ఉంటూ క్రికెట్ ఆడటం మానసికంగా సవాలు విసురుతుంది. ఈ పరిస్థితుల్లో అందరూ గొప్ప నిబద్ధత చూపించారు."