బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ సోదరుడు స్నేహశిష్కు కరోనా పాజిటివ్‌గా తేలింది. ఆయన్ను ఆస్పత్రిలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. దీంతో దాదా హోం క్వారంటైన్లోకి వెళ్లారు. స్నేహాశిష్ ప్రస్తుతం బంగాల్ క్రికెట్ సంఘం కార్యదర్శిగా పనిచేస్తున్నారు.
సోదరుడికి కరోనా.. హోం క్వారంటైన్లో గంగూలీ - corona ganguly
క్యాబ్ కార్యదర్శిగా చేస్తున్న తన సోదరుడు స్నేహాశిష్‌కు కరోనా పాజిటివ్‌గా తేలడం వల్ల, బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ హోం క్వారంటైన్లోకి వెళ్లారు.
బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ
కొన్నిరోజుల క్రితం తన భార్య, అత్తమామలకు కరోనా పాజిటివ్ రావడం వల్ల స్నేహాశిష్, గంగూలీ ఉంటున్న ఇంట్లోకి మారారు. ఇప్పుడు ఈయనకు వైరస్ సోకినట్లు తేలింది. దీంతో దాదా, క్వారంటైన్లోకి వెళ్లారు.
అయితే గత నెలలోనే స్నేహాశిష్‌కు కరోనా వచ్చినట్లు వార్తలు వచ్చాయి. కానీ అవన్నీ కేవలం పుకార్లేనని, తాను ఆరోగ్యంగా ఉన్నట్లు అప్పుడు తెలిపారు.