బీసీసీఐతో రాహుల్ జోహ్రీ బంధం ముగిసింది. అతని రాజీనామాను బోర్డు ఆమోదించింది. 2016లో బీసీసీఐ ముఖ్య కార్యనిర్వహక అధికారిగా జోహ్రీ బాధ్యతలు చేపట్టారు. సుప్రీం కోర్టు నియమించిన బోర్డు పాలకుల కమిటీ గంగూలీ నేతృత్వంలోని బోర్డుకు పూర్తి అధికారాలు అప్పగించిన వెంటనే.. జోహ్రీ తన పదవికి రాజీనామా చేశారు. అయితే, బోర్డు ఆమోదించలేదు. 2021లో ఒప్పందం ముగిసేవరకు బాధ్యతల్లో కొనసాగాలని ఆయనను కోరింది.
బీసీసీఐతో ముగిసిన జోహ్రీ బంధం
బీసీసీఐతో రాహుల్ జోహ్రీ బంధానికి తెరపడింది. ఈ మేరకు ఆయన సమర్పించిన రాజీనామా లేఖను బోర్డు ఆమోదించింది.
బీసీసీఐతో ముగిసిన జోహ్రి బంధం
గతేడాది డిసెంబరు 27న మరోసారి జోహ్రీ రాజీనామా సమర్పించారు. చాలాకాలం పెండింగ్లో ఉన్న జోహ్రీ రాజీనామాను గురువారం బోర్డు ఆమోదించినట్లు అధికారులు తెలిపారు.