తెలంగాణ

telangana

ETV Bharat / sports

టీమిండియా టైటిల్ స్పాన్సర్​గా పేటీఎం

దేశంలో జరిగే మ్యాచ్​ల కోసం ఐదేళ్లకు గాను 326.80 కోట్లు చెల్లించి బీసీసీఐ టైటిల్ స్పాన్సర్ హక్కులు సొంతం చేసుకుంది పేటీఎం సంస్థ. ఒక మ్యాచ్​కు 3.80 కోట్లు చెల్లించనుంది.

పేటీఎం

By

Published : Aug 22, 2019, 9:50 AM IST

Updated : Sep 27, 2019, 8:44 PM IST

బీసీసీఐ టైటిల్ స్పాన్సర్​గా పేటీఎం మరోసారి అవకాశం దక్కించుకుంది. ఐదేళ్ల కాలానికి ఒక్కో మ్యాచ్​కు రూ.3.80 కోట్ల బిడ్ వేసి హక్కులు పొందింది. 2019-23 హోం సీజన్‌కు రూ.326.80 కోట్లతో టైటిల్‌ స్పాన్సర్‌షిప్​ను సొంతం చేసుకుంది.

"2019-23 హోం సీజన్‌కు గెలిచిన బిడ్‌ ధర రూ.326.80 కోట్లు. గతంలో ఒక మ్యాచ్‌కు బిడ్‌ ధర రూ.2.4 కోట్లు కాగా ఇప్పుడు రూ.3.80 కోట్లకు పెరిగింది. అంటే దాదాపు 58% వృద్ధి సాధించింది" అని బీసీసీఐ ఓ ప్రకటనలో వెల్లడించింది. ‘

"బీసీసీఐ హోం సిరీస్‌ టైటిల్‌ స్పాన్సర్‌గా పేటీఎంను ప్రకటిస్తున్నందుకు ఆనందంగా ఉంది. పేటీఎం భారత్‌లో ఆధునిక తరానికి చెందిన సంస్థ. భారత్‌ క్రికెట్‌కు సుదీర్ఘంగా టైటిల్‌ స్పాన్సర్‌గా వ్యవహరిస్తున్నందుకు మేం గర్విస్తున్నాం".
-బీసీసీఐ సీఈవో రాహుల్‌ జోహ్రీ

భారత్‌ క్రికెట్‌ను అమితంగా ప్రేమిస్తుందని, పేటీఎం అతిపెద్ద అభిమాని అని ఆ సంస్థ సీఈవో విజయ్‌ శేఖర్ శర్మ అన్నారు.

ఇవీ చూడండి.. యాషెస్: ఇంగ్లాండ్​ తొలి గెలుపు అందుకుంటుందా..!

Last Updated : Sep 27, 2019, 8:44 PM IST

ABOUT THE AUTHOR

...view details