న్యూజిలాండ్‌తో రెండు టెస్టుల సిరీస్‌కు కోహ్లీ సేన సిద్ధమైంది. ఈ సిరీస్‌కు స్టార్ బ్యాట్స్‌మెన్ రోహిత్‌శర్మ, శిఖర్ ధావన్ దూరమవగా... పృథ్వీ షా, శుభ్‌మన్ గిల్, హనుమ విహారి చోటు దక్కించుకున్నారు. టెస్ట్‌ల్లోకి రీ ఎంట్రీ ఇస్తాడనుకున్న రాహుల్‌కు మాత్రం నిరాశ తప్పలేదు. ఫిబ్రవరి 21 నుంచి తొలి టెస్టు ప్రారంభంకానుంది.
గిల్- విహారికి ఛాన్స్...
భారత యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్.. న్యూజిలాండ్- ఏ తో జరిగిన తొలి అనధికారిక టెస్టులో డబుల్ సెంచరీతో రాణించాడు. ఈ మ్యాచ్‌లో 204 రన్స్‌తో అజేయంగా నిలిచాడు. ఇతడితో పాటు ఇదే మ్యాచ్‌లో సెంచరీతో అజేయంగా నిలిచాడు ఆంధ్ర కెప్టెన్ హనుమ విహారి. తాజా ప్రదర్శనతో వీరిద్దరికీ టెస్టు జట్టులో చోటు దక్కింది.
రోహిత్ దూరం...
గాయం కారణంగా కివీస్‌తో టెస్టు సిరీస్‌కు స్టార్ బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ దూరమయ్యాడు. హిట్‌మ్యాన్ స్థానంలో పృథ్వీ లేదా గిల్ ఓపెనింగ్ చేసే అవకాశముంది. మయాంక్ అగర్వాల్ మరో ఓపెనర్‌గా బరిలోకి దిగనున్నాడు. కివీస్‌తో ఇటీవల జరిగిన ఐదో టీ20లో కాలిపిక్క గాయంతో ఇబ్బందిపడ్డాడు రోహిత్. 60 పరుగులు చేసి రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగాడు హిట్‌మ్యాన్. అనంతరం ఫీల్డింగ్ చేయడానికి రాలేదు. ప్రస్తుతం ఈ గాయం నుంచి కోలుకునే అవకాశం లేకపోవడం వల్ల అతను వన్డే సహా కివీస్ పర్యటనకు దూరమయ్యాడు.
భారత జట్టు ఇదే...
విరాట్ కోహ్లీ (కెప్టెన్), మయాంక్ అగర్వాల్, పృథ్వీ షా, శుభ్‌మన్ గిల్, ఛెతేశ్వర్ పుజారా, అజింక్య రహానే (వైస్ కెప్టెన్), హనుమ విహారీ, వృద్ధిమాన్ సాహా (కీపర్), రిషబ్ పంత్, రవిచంద్ర అశ్విన్, రవీంద్ర జడేజా, జస్ప్రిత్ బుమ్రా, ఉమేశ్ యాదవ్, మహ్మద్ షమి, నవదీప్ సైనీ, ఇషాంత్ శర్మ.
ఇదీ చూడండి...
కివీస్‌కు ఎదురుదెబ్బ.. కేన్ లేకుండానే భారత్‌తో వన్డే పోరు