కరోనా వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో క్రీడారంగం స్తంభించిపోయింది. అన్ని పోటీలు వాయిదా లేదా రద్దయ్యాయి. అయితే జర్మనీ ఫుట్‌బాల్ లీగ్ బండ్సెలిగా మాత్రం వచ్చే నెల నుంచి ప్రేక్షకుల లేకుండానే ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఖాళీ మైదానాల్లో క్రీడల నిర్వహించడం అనే అంశంపై పలువురు భారత ఆటగాళ్లు, మాజీలు.. తమ అభిప్రాయాలు వెల్లడించారు.
"జర్మనీ, భారత్‌లకు చాలా తేడా ఉంది. మనదగ్గర ఖాళీ స్టేడియాల్లో టోర్నీలు నిర్వహించడం అనేది కష్టం. పరిస్థితులు చక్కబడే వరకు క్రికెట్ మ్యాచ్‌లు జరగకపోవచ్చు. మనిషి ఆరోగ్యాన్ని ప్రమాదంలో పెట్టి, పోటీలు నిర్వహించరని నా అభిప్రాయం"
-సౌరభ్ గంగూలీ, బీసీసీఐ అధ్యక్షుడు
"ఐపీఎల్లో ఆడే ప్రముఖ క్రికెటర్లు.. విమానాశ్రయాలకు వెళ్లి వచ్చేటప్పుడు, హోటళ్లులో ఉండేటప్పుడు, స్టేడియంలో ఉన్నప్పుడు బయట అభిమానులు ఎక్కువ సంఖ్యలో చేరతారు. అప్పుడు భౌతిక దూరం పాటించడమనేది కష్టమవుతుంది. కరోనాకు మందు కనుగొనేంత వరకు క్రికెట్ మ్యాచ్‌ల నిర్వహణ వాయిదా వేయడమే మంచిది"
-హర్భజన్‌సింగ్, టీమిండియా మాజీ క్రికెటర్
క్రికెట్ మైదానం
"చెపాక్‌లో ప్రాక్టీసు సెషన్స్ జరిగేటప్పుడే అధిక సంఖ్యలో అభిమానులు వచ్చారు. అప్పుడే వారిని స్టేడియంలోకి అనుమతించలేదు. అలాంటిది ఇప్పుడు వారు లేకుండా మ్యాచ్ జరిగితే వారు ఊరుకుంటారా? ఎక్కువ సంఖ్యలో వస్తారు. అలాంటి సమయంలో వారిని ఆపడం కష్టమవుతుంది"