ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో కొత్త జట్ల చేర్చే విషయమై బీసీసీఐ పరిపాలన విభాగం నిర్ణయం తీసుకుంది. అహ్మదాబాద్ వేదికగా గురువారం జరిగిన వార్షిక సమావేశంలో ఈ విషయాన్ని ఖరారు చేసినట్లు బీసీసీఐ అధికారి తెలిపారు. దీని ప్రకారం 2022 నుంచి ఐపీఎల్లో 10 జట్లు పోటీపడనున్నాయి.
ఐపీఎల్లో 10 జట్లు.. బీసీసీఐ కీలక నిర్ణయం!
బీసీసీఐ వార్షిక భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 2022 నుంచి ఐపీఎల్లో 10 జట్లను ఆడించడం సహా బోర్డు ఉపాధ్యక్షుడిగా రాజీవ్ శుక్లాను నియమించినట్లు తెలుస్తోంది.
ఐపీఎల్లో 10 జట్లు.. బీసీసీఐ కీలక నిర్ణయం!
2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌లో టీ20 క్రికెట్‌ను చేర్చే విషయమై ఐసీసీ వేసిన బిడ్‌కు బీసీసీఐ సపోర్ట్‌గా నిలిచింది. లాక్డౌన్ ప్రభావంతో జీతాల్లేక ఇబ్బందులు పడ్డ ఫస్ట్ క్లాస్ క్రికెటర్లకు(పురుషులు, మహిళలు) పరిహారం చెల్లించాలని నిర్ణయం తీసుకుంది.
బోర్డు ఉపాధ్యక్షుడిగా రాజీవ్ శుక్లాను నియమిస్తూ బీసీసీఐ ఉత్తర్వులు జారీ చేసింది. ఐసీసీ బోర్డులో డైరెక్టర్‌గా గంగూలీ కొనసాగేందుకు పరిపాలన కమిటీ అనుకూలంగా నిర్ణయం తీసుకుంది.