తెలంగాణ

telangana

ETV Bharat / sports

కార్తీక్ క్షమాపణకు బీసీసీఐ అంగీకారం..

టీమిండియా ఆటగాడు దినేశ్ కార్తీక్ క్షమాపణను బీసీసీఐ ఆమోదించింది. ఈ విషయం ఇంతటితో ముగిసిందని తెలిపింది.

కార్తీక్

By

Published : Sep 16, 2019, 2:07 PM IST

Updated : Sep 30, 2019, 7:56 PM IST

నిబంధనలు అతిక్రమించి... బీసీసీఐ ఆగ్రహానికి లోనైన టీమిండియా క్రికెటర్ దినేశ్​ కార్తీక్​ క్షమాపణను అంగీకరించింది బోర్డు. ఈ గొడవ ఇంతటితో సద్దుమణిగిందని తెలిపింది.

దినేశ్ కార్తీక్​కు నోటీసులు జారీ చేసింది భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ). దీనిపై క్షమించమని కోరుతూ బోర్డుకు లేఖ రాశాడీ ఆటగాడు. తాజాగా అతడి క్షమాపణను అంగీకరించింది బీసీసీఐ.

ఐపీఎల్​లో కోల్​కతా నైట్ రైడర్స్​ కెప్టెన్​గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు దినేశ్ కార్తీక్. ఆ ఫ్రాంఛైజీ యజమాని షారుఖ్ ఖాన్.. కరీబియన్ ప్రీమియర్​ లీగ్​లో ట్రింబాగో నైట్ రైడర్స్ జట్టునూ సొంతం చేసుకున్నాడు.

ఇటీవల ట్రింబాగో డ్రెస్సింగ్​ రూమ్​లో మెక్​కల్లమ్ పక్కన కూర్చుని, ఆ టీమ్ జెర్సీ ధరించి మ్యాచ్ చూశాడు కార్తీక్. బీసీసీఐ నిబంధనల ప్రకారం.. భారత క్రికెటర్లు అనుమతి లేకుండా ఎలాంటి విదేశీ టోర్నీల్లో పాల్గొనకూడదు. అందువల్ల కార్తీక్​కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది బీసీసీఐ. వివరణ ఇవ్వాలని వారం గడువు పెట్టింది. ఈ నేపథ్యంలో క్షమించమని కోరుతూ.. బీసీసీఐకి లేఖ రాశాడు డీకే. అందుకు బోర్డు అంగీకరించింది.

ఇవీ చూడండి.. గావస్కర్​ సరసన చేరిన స్టీవ్ స్మిత్​

Last Updated : Sep 30, 2019, 7:56 PM IST

ABOUT THE AUTHOR

...view details