కరోనా వల్ల నిరవధిక వాయిదా పడిన 89వ వార్షిక సర్వసభ్య సమావేశాన్ని(ఏజీఎమ్) ఈ నెల 24న నిర్వహించనున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. ఈ మేరకు అన్ని రాష్ట్ర సంఘాలకు సమాచారమిచ్చింది. ఈ భేటికి సంబంధించిన వేదిక వివరాలను త్వరలో తెలియజేయనుంది. ముఖ్యంగా ఈ సమావేశంలో 23 అంశాల గురించి చర్చించుకోనున్నారు. అందులో ముఖ్యమైనవి..
- ఐపీఎల్లో ఇప్పటికే ఉన్న ఎనిమిది జట్లకు అదనంగా మరో రెండు జట్లను చేర్చడం
- ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చే అవకాశంపై చర్చ
- ఐపీఎల్ పాలకమండలిలో ప్రతినిధులను ఎన్నుకోవడం
- 2021 ఐసీసీ టీ20 ప్రపంచకప్ నిర్వహణ
- టీమ్ఇండియా భవిష్యత్తు పర్యటనలు