తెలంగాణ

telangana

ETV Bharat / sports

కరోనా నిబంధనలు బేఖాతరు.. లిన్, లారెన్స్​లకు ఫైన్ - క్రికెట్​ ఆస్ట్రేలియా వార్తలు

బిగ్​బాష్​ లీగ్​లోని ఇద్దరు ఆటగాళ్లు కరోనా నిబంధనలు అతిక్రమించినట్లు సోషల్​మీడియాలో ప్రచారం జరిగింది. దీనిపై విచారణ చేపట్టిన క్రికెట్​ ఆస్ట్రేలియా.. బ్రిస్బేన్​ జట్టుకు చెందిన క్రిస్​ లిన్​, డాన్​ లారెన్స్​లకు మంగళవారం జరిమానా విధించింది.

BBL: Lynn, Lawrence sanctioned for Covid-19 protocol breach
క్రిస్​ లీన్​, లారెన్స్​లకు క్రికెట్​ ఆస్ట్రేలియా జరిమానా

By

Published : Dec 15, 2020, 4:48 PM IST

బిగ్​బాష్​ లీగ్​లో కొవిడ్​ నిబంధనలు అతిక్రమించిన కారణంగా ఇద్దరు ఆటగాళ్లకు జరిమానా విధించింది క్రికెట్​ ఆస్ట్రేలియా. బ్రిస్బేన్​ హీట్​ జట్టులోని క్రిస్​ లిన్​, డాన్​ లారెన్స్​లపై ఆరోపణలు వచ్చిన క్రమంలో వీరిద్దరి జీతాల్లో కోత పడింది.

లిన్​, లారెన్స్​.. ఇద్దరూ కలిసి ప్రేక్షకులకు దగ్గరగా వెళ్లి వారితో సెల్ఫీలు దిగినట్లు సోషల్​మీడియాలో ప్రచారం జరిగిందని క్రికెట్​ ఆస్ట్రేలియా విచారణలో తేలింది.

అయితే, కరోనా నిబంధనలు అతిక్రమించిన కారణంగా వీరిద్దరూ క్షమాపణలు తెలియజేశారు. ఈ నేపథ్యంలో సోమవారం సిడ్నీ థండర్స్​తో జరిగిన మ్యాచ్​లో జట్టు ఆటగాళ్లకు క్రిస్​ లిన్​, లారెన్స్​ భౌతిక దూరం పాటించారు. ఈ మ్యాచ్​లో బ్రిస్బేన్​ హీట్​ జట్టు నాలుగు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది.

కరోనా నిబంధనలు సెక్షన్​ 1,3,4,9 ప్రకారం బ్రిస్బేన్​ హీట్​ జట్టుకు 50 వేల డాలర్లను జరిమానాగా.. అతిక్రమించిన ఆటగాళ్లకు 10వేల డాలర్ల ఫైన్​ను మంగళవారం క్రికెట్​ ఆస్ట్రేలియా విధించింది.

ABOUT THE AUTHOR

...view details