తెలంగాణ

telangana

By

Published : Dec 22, 2019, 5:02 PM IST

Updated : Dec 22, 2019, 5:40 PM IST

ETV Bharat / sports

బిగ్​బాష్​ లీగ్​: 11 సిక్సర్లతో చెలరేగిన క్రిస్​లిన్​

ఐపీఎల్-2020​ వేలంలో ఎంపికైన తర్వాత తన విధ్వంసకర ఇన్నింగ్స్​ను రుచి చూపిస్తున్నాడు క్రిస్​ లిన్​. ప్రస్తుతం జరుగుతోన్న బిగ్​బాష్​ లీగ్​లో విశ్వరూపం ప్రదర్శిస్తున్నాడు. గత ఐపీఎల్ సీజన్​లో నిలకడ లేమి కారణంగా కోల్​కతా నైట్​రైడర్స్​ ఇతడిని విడిచిపెట్టేసింది. అయితే డిసెంబర్​ 19న జరిగిన వేలంలో ఈ స్టార్​ హిట్టర్​ను కనీస ధర 2 కోట్లకు కొనుక్కుంది ముంబయి జట్టు.

BBL 2019 chris lynn
బిగ్​బాష్​ లీగ్​: 11 సిక్సర్లతో చెలరేగిన క్రిస్​లిన్​

ఆస్ట్రేలియా వేదికగా జరుగుతోన్న బిగ్​బాష్​ లీగ్​లో క్రిస్ ​లిన్​ విధ్వంసకర ప్రదర్శన చేశాడు. బ్రిస్బేన్​ హీట్​కు కెప్టెన్​గా ఉన్న లిన్​.. ఆదివారం సిడ్నీ సిక్సర్స్​తో జరిగిన మ్యాచ్​లో 35 బంతుల్లో 94 పరుగులు చేశాడు. ఇందులో 11 సిక్సర్లు, 4 ఫోర్లు ఉన్నాయి. స్ట్రయిక్​ రేట్ 268.57గా నమోదైంది. ఇతడి ధాటికి నిర్ణీత 20 ఓవర్లలో 209 పరుగులు చేసింది బ్రిస్బేన్​​ జట్టు. ఈ క్రమంలో లీగ్​లో 2వేల పరుగులు చేసిన తొలి బ్యాట్స్​మన్​గా చరిత్ర సృష్టించాడు లిన్.

వేలంలో కనీస ధర...

ఈ నెల 19న కోల్​కతా వేదికగా జరిగిన ఐపీఎల్​ 13వ సీజన్​ వేలంలో.. లిన్​ను కనీస ధర రూ.2 కోట్లకు దక్కించుకుంది ముంబయి ఇండియన్స్​. గతంలో రూ. 9.6 కోట్లకు కొనుగోలు చేసిన కోల్‌కతా నైట్‌రైడర్స్.. ఈ వేలం ముందు అనూహ్యంగా అతడిని వదులుకుంది. ఐపీఎల్ 2018, 2019 సీజన్‌లో ఆ జట్టు టాప్ స్కోరర్లలో ఒకడిగా నిలిచిన క్రిస్‌ లిన్‌ను వదులుకోవడంపై అభిమానులే కాకుండా యువరాజ్​ లాంటి క్రికెటర్లూ ఆశ్చర్యపోయారు.

Last Updated : Dec 22, 2019, 5:40 PM IST

ABOUT THE AUTHOR

...view details