తెలంగాణ

telangana

ETV Bharat / sports

సన్​రైజర్స్​కు ప్రపంచకప్ విన్నింగ్ కోచ్ - IPL

ప్రపంచకప్​లో ఇంగ్లాండ్​ను విశ్వవిజేతగా నిలిపేందుకు ఓ కారణమైన కోచ్​ ట్రేవర్ బేలిస్​ను.. ఐపీఎల్​లోని సన్​రైజర్స్ హైదరాబాద్​ హెడ్ కోచ్​గా నియమించుకుంది.

సన్​రైజర్స్​కు ప్రపంచకప్ విన్నింగ్ కోచ్

By

Published : Jul 18, 2019, 9:36 PM IST

ఇటీవలే జరిగిన ప్రపంచకప్​లో ఇంగ్లాండ్​ విజేతగా నిలిచింది. ఆటగాళ్లను అద్భుతంగా తీర్చిదిద్దిన కోచ్ ట్రేవర్ బేలిస్​కు ప్రశంసలు దక్కుతున్నాయి. అతడిని ఐపీఎల్​ జట్టు సనైరైజర్స్ హైదరాబాద్​ హెడ్ కోచ్​గా నియమించుకుంది. వచ్చే సీజన్​ నుంచి బాధ్యతలు తీసుకోనున్నాడు. ఇంతకు ముందు ఆస్ట్రేలియాకు చెందిన టామ్ మూడీ.. ఐపీఎల్​లో హైదరాబాద్​ జట్టు కోచ్​గా వ్యవహరించాడు.

ట్రేవర్ బేలిస్

"ఎన్నో చర్చల తర్వాత సన్​రైజర్స్​ హైదరాబాద్​ యాజమాన్యం కొత్తగా హెడ్​ కోచ్​ను నియమించాలని నిర్ణయించింది. ఇంగ్లాండ్​కు ప్రస్తుతం కోచ్​గా వ్యవహరిస్తున్న బేలిస్ వచ్చే సీజన్ నుంచి మా జట్టుతో కలవనున్నాడు. ఐపీఎల్​లో ఇప్పటికే కోల్​కతాకు రెండు ట్రోఫీలు అందించాడు. బిగ్​ బాష్​ లీగ్​లోనూ సిడ్నీ సిక్సర్స్​ను విజేతగా నిలిపాడు. అతడి నేతృత్వంలో హైదరాబాద్​ జట్టు రాణిస్తుందని అనుకుంటున్నాం" -సన్​రైజర్స్ యాజమాన్యం

వచ్చే నెలలో జరిగే యాషెస్ సిరీస్​ తర్వాత ఇంగ్లాండ్​ కోచ్​ స్థానం నుంచి వైదొలగనున్నాడు బేలిస్.

గత ఏడేళ్లుగా జట్టు కోచ్​గా ఉన్న టామ్ మూడీకి ధన్యవాదాలు తెలిపింది సన్​రైజర్స్​ హైదరాబాద్.

"టామ్ మూడీకు ధన్యవాదాలు. గత ఏడేళ్లలో 5 సార్లు జట్టు ఫ్లేఆఫ్స్​కు అర్హత సాధించడంలో సహాయపడ్డాడు. 2016లో ట్రోఫీ గెలుచుకోవడంలో భాగంగా నిలిచాడు"

-సన్​రైజర్స్ హైదరాబాద్​ యాజమాన్యం

ఇది చదవండి: 44 ఏళ్లలో రాని కప్పు 4 ఏళ్లలో.. కారణాలివే!

ABOUT THE AUTHOR

...view details