తెలంగాణ

telangana

ETV Bharat / sports

తూచ్.. నేను ఔట్​ కాదు.. మైదానం నుంచి వెళ్లను! - Sports News

ముంబయి-బరోడా మధ్య జరిగిన రంజీ మ్యాచ్​లో ఆశ్చర్యకర సంఘటన జరిగింది. అంపైర్​ తప్పుడు నిర్ణయానికి బరోడా బ్యాట్స్​మన్ యూసఫ్ పఠాన్​ను బలయ్యాడు. తాను ఔట్​ కాదంటూ, మైదానం నుంచి వెళ్లనంటూ కొద్దిసేపు అక్కడే ఉండిపోయాడీ క్రికెటర్.

తూచ్.. నేను ఔట్​ కాదు.. మైదానం నుంచి వెళ్లను!
క్రికెటర్ యూసఫ్ పఠాన్

By

Published : Dec 13, 2019, 8:57 AM IST

Updated : Dec 13, 2019, 11:11 AM IST

క్రికెట్​లో అంపైరింగ్ ప్రమాణాలు రోజురోజుకు పడిపోతున్నాయి. ఈ విషయంపై అభిమానులు ఎప్పటినుంచో గుర్రుగా ఉన్నారు. గురువారం.. ముంబయి-బరోడా మధ్య జరిగిన రంజీ మ్యాచ్​లో ఇలాంటిదే ఓ సంఘటన జరిగింది. నాటౌట్​ను ఔట్​గా ప్రకటించాడు అంపైర్. మైదానం నుంచి వెళ్లనంటూ ఆ బ్యాట్స్​మన్ అక్కడే నిల్చుండిపోయాడు. చివరకు చేసేదేమి లేక భారంగా వెనుదిరిగాడు.

అసలేం జరిగింది?

ముంబయి-బరోడా మధ్య రంజీ మ్యాచ్​. 533 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బరోడా 169 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి ఓటమి అంచున నిలుచుంది. క్రీజులో యూసఫ్ పఠాన్ ఉన్నాడు. రెండో ఇన్నింగ్స్ 48వ ఓవర్‌లో ముంబయి స్పిన్నర్‌ శశాంక్‌ వేసిన బంతిని డిఫెన్స్‌ ఆడే ప్రయత్నం చేశాడు. అనుహ్యంగా బౌన్స్‌ అయి పఠాన్‌ ఛాతికి తగిలి షార్ట్‌ లెగ్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న జయ్‌ బిస్తా చేతుల్లో పడింది. ముంబయి ఫీల్డర్లు అప్పీలు చేశారు.

కాసేపు సంకోచించిన అంపైర్.. పఠాన్‌ను ఔట్​గా ప్రకటించాడు. ముంబై క్రికెటర్లు సంబరాలు చేసుకోగా, పఠాన్‌ షాక్‌కు గురయ్యాడు. క్రీజు వదిలి వెళ్లడానికి నిరాకరించాడు. చివరకు చేసేదేమి లేక నిరాశగా వెనుదిరిగాడు.

ఈ మ్యాచ్‌లో ముంబయి 309 పరుగుల భారీ తేడాతో గెలిచింది. ముంబయి క్రికెటర్ పృథ్వీషా డబుల్‌ సెంచరీతో విజయంలో కీలక పాత్ర పోషించాడు.

ఇది చదవండి: పృథ్వీషా 'డబుల్'​ ధమాకా.. ఆధిక్యంలో ముంబయి

Last Updated : Dec 13, 2019, 11:11 AM IST

ABOUT THE AUTHOR

...view details