తనపై అసభ్యకర వ్యాఖ్యలు చేశాడని బరోడా సారథి కృనాల్ పాండ్యపై ఆ జట్టు వైస్ కెప్టెన్ దీపక్ హుడా ఆరోపణలు చేశాడు. ఈ మేరకు బరోడా క్రికెట్ అసోసియేషన్‌కు ఫిర్యాదు చేశాడు. ఈ కారణంగానే ఆదివారం నుంచి ప్రారంభమయ్యే 'సయ్యద్ ముస్తాక్ అలీ టీ20' టోర్నీ నుంచి తప్పుకుంటున్నట్లు లేఖలో పేర్కొన్నాడు.
గుజరాత్ స్థానిక న్యూస్ ఛానల్ కథనం ప్రకారం.. కృనాల్, హుడా మధ్య వాగ్వివాదం జరగ్గా కృనాల్, హుడాను బెదరించినట్లు తెలుస్తోంది. దీంతో మానసిక ఒత్తిడికి గురైన హుడా.. తప్పుకోవాలని నిర్ణయం తీసుకున్నాడట. ఉత్తరాఖండ్ జట్టుతో ఆదివారం తన తొలి మ్యాచ్ ఆడనుంది బరోడా. ఇందుకోసం 17 మందితో కూడిన జాబితాను ప్రకటించగా అందులో హుడా పేరు లేదు.