బంగ్లాదేశ్తోమంగళవారంజరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో విజయం సాధించింది టీమిండియా. ఈ గెలుపు ప్రపంచకప్‌లో పాల్గొనే భారత జట్టుకు ఉత్సాహాన్నిస్తుందని అంటున్నాడు పేసర్ భువనేశ్వర్ కుమార్. జూన్ 5న దక్షిణాఫ్రికాతో తొలి మ్యాచ్ ఆడనుంది టీమిండియా.
తొలి ప్రాక్టీస్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో ఓడింది భారత్. మంగళవారం బంగ్లాదేశ్‌తో వార్మప్ మ్యాచ్‌లో అన్ని విభాగాల్లోనూ రాణించి విజయం సాధించింది. ఇదే ఊపుతో ప్రపంచకప్‌లో పాల్గొనుంది.
"బ్యాటింగ్, బౌలింగ్‌కు ఇక్కడ కష్టమైన పరిస్థితులు ఎదురయ్యాయి. కానీ ఆ రెండు విభాగాల్లోనూ రాణించాం. ఇది ప్రపంచకప్‌లో పాల్గొనే భారత జట్టుకు ఉత్సాహాన్నిచ్చే అంశం. దక్షిణాఫ్రికాతో తొలి మ్యాచ్‌కు వారం రోజులు వ్యవధి ఉన్న నేపథ్యంలో ప్రణాళికలు రచిస్తున్నాం" -భువనేశ్వర్ కుమార్, టీమిండియా బౌలర్