తెలంగాణ

telangana

ETV Bharat / sports

శ్రీలంక-బంగ్లాదేశ్ టెస్టు సిరీస్​ వాయిదా

ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్​లో భాగంగా వచ్చే నెలలో బంగ్లాదేశ్​, శ్రీలంక మధ్య జరగాల్సిన మూడు టెస్టుల సిరీస్​ను వాయిదా వేస్తున్నట్లు సోమవారం ఐసీసీ ప్రకటించింది. నిర్బంధ నియమాలకు సంబంధించి ఇరు దేశాల దేశాల క్రికెట్​ బోర్డుల మధ్య ఏకాభిప్రాయం రాకపోవడమే కారణమని తెలుస్తోంది.

Bangladesh tour of Sri Lanka postponed indefinitely: ICC
బంగ్లాదేశ్​, శ్రీలంక టెస్టు సిరీస్​ వాయిదా

By

Published : Sep 29, 2020, 12:52 PM IST

అక్టోబరులో బంగ్లాదేశ్.. శ్రీలంక పర్యటనకు వెళ్లాల్సి ఉంది. అయితే కొన్ని కారణాల వల్ల ఈ సిరీస్​ను అంతర్జాతీయ క్రికెట్​ మండలి (ఐసీసీ) వాయిదా వేసింది. ఈ విషయాన్ని సోమవారం ఓ అధికారిక ప్రకటన ద్వారా ఐసీసీ తెలియజేసింది.

సిరీస్​ ప్రారంభమయ్యే ముందు ఆటగాళ్లు నిర్బంధానికి సంబంధించి బంగ్లాదేశ్​ క్రికెట్​ బోర్డు(బీసీబీ), శ్రీలంక క్రికెట్​ (ఎస్​ఎల్​సీ) మధ్య ఏకాభిప్రాయం రాకపోవడమే కారణమని తెలుస్తోంది. పర్యటనలో బంగ్లా క్రికెటర్లు 14 రోజుల నిర్బంధంలో కచ్చితంగా ఉండాలనే శ్రీలంక ఆరోగ్య నియమాలకు బీసీబీ అభ్యంతరం వ్యక్తం చేసింది.

"శ్రీలంకకు వెళ్లే పర్యాటకులు ఆరోగ్య నిబంధనల ప్రకారం కచ్చితంగా 14 రోజుల పాటు నిర్బంధంలో ఉండాలి. అయితే ఈ విషయంలో శ్రీలంక క్రికెట్​ బోర్డు ఏమీ చేయలేమని చెప్పింది. ఈ నేపథ్యంలో పరిస్థితులు మెరుగుపడిన తర్వాత సిరీస్​ నిర్వహిద్దామని తెలియజేశాం. వారి ఆరోగ్య నియమాలను పాటిస్తూ మేము ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్​ ఆడలేం. వారు మేం చెప్పినదాంట్లో 14 రోజుల నిర్బంధం మినహా మిగిలిన అన్నింటికి అంగీకరించారు."

- నజ్ముల్​ హసన్​, బంగ్లాదేశ్​ క్రికెట్​ బోర్డు అధ్యక్షుడు

వచ్చే నెలలో ఐసీసీ ప్రపంచటెస్టు ఛాంపియన్​షిప్​లో భాగంగా బంగ్లాదేశ్, శ్రీలంక జట్ల మధ్య మూడు టెస్టులు జరగాల్సిఉంది. ​

ABOUT THE AUTHOR

...view details