తెలంగాణ

telangana

ETV Bharat / sports

ప్రపంచకప్​ తర్వాత టీమిండియా షెడ్యూల్ ఇదే..!

ప్రపంచకప్​ తర్వాత టీమిండియా ఆడే స్వదేశీ సిరీస్ వివరాలను బీసీసీఐ ప్రకటించింది. దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్​, వెస్టిండీస్, జింబాబ్వే, ఆస్ట్రేలియా జట్లతో మొత్తం 5 టెస్టులు, 9 వన్డేలు, 12 టీట్వంటీలు ఆడనుంది భారత క్రికెట్ జట్టు.

By

Published : Jun 4, 2019, 10:01 AM IST

ప్రపంచకప్​ తర్వాత టీమిండియా షెడ్యూల్ ఇదే..!

ప్రస్తుతం ప్రపంచకప్​ ఆడుతోంది టీమిండియా. ఆ తర్వాత భారత్ జట్టు స్వదేశంలో ఆడే సిరీస్​ వివరాలను సోమవారం ప్రకటించింది భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ). మొత్తంగా 5 టెస్టులు, 9 వన్డేలు, 12 టీట్వంటీలు ఆడనుంది కోహ్లీ సేన.

కోహ్లీ సేన

టెస్ట్ ఛాంపియన్​షిప్​లో భాగంగా దక్షిణాఫ్రికాతో 5, బంగ్లాదేశ్​తో 2 టెస్టులు ఆడనుంది భారత క్రికెట్ జట్టు.

దక్షిణాఫ్రికాతో సెప్టెంబరు 15, 18, 22న మూడు టీట్వంటీ మ్యాచ్​లు ఆడనుంది. అక్టోబరులో ఇదే జట్టుతో 3 టెస్టుల్లో తలపడనుంది భారత్. ఆ తర్వాత నవంబరులో బంగ్లాదేశ్​తో మూడు టీట్వంటీలు, రెండు టెస్టులు ఆడనుంది టీమిండియా.

స్వదేశీ పర్యటన వివరాలు

అనంతరం వెస్టిండీస్​ భారత్​లో పర్యటించనుంది. మూడు టీట్వంటీలు, మూడు వన్డేలు ఆడనుంది. ఆ తర్వాత జింబాబ్వేతో మూడు టీట్వంటీలు, కొన్ని రోజుల తర్వాత ఆస్ట్రేలియాతో మూడు వన్డేల్లో తలపడనుంది. మార్చిలో దక్షిణాఫ్రికాతో జరిగే మూడు వన్డేల సిరీస్​తో ఈ సీజన్​ పూర్తవుతుంది.

స్వదేశీ పర్యటన వివరాలు
స్వదేశీ పర్యటన వివరాలు

ఇది చదవండి: పాకిస్థాన్​లో ఆసియా కప్.. భారత్​ పాల్గొంటుందా?

ABOUT THE AUTHOR

...view details