బంగ్లాదేశ్‌లో జరగనున్న టీ-20 ట్రైసిరీస్‌లో జింబాబ్వే ఆడనుంది. ఈ ఆఫ్రికా జట్టుపై ఐసీసీ నిషేధం అమలులో ఉన్నా బంగ్లాలో మ్యాచ్‌లు ఆడనుంది. ఈ మేరకు గురువారం ప్రకటన విడుదల చేసింది బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు.
" ఐసీసీ ఈవెంట్లలో మాత్రమే జింబాబ్వేపై సస్పెన్షన్ ఉంది. ద్వైపాక్షిక మ్యాచ్‌లు ఆడకూడదనే నిబంధన ఎక్కడా లేదు. ఈ విషయం గురించి ముందే సమాచారమిచ్చాం. అందుకే ఆ జట్టును ఈ సిరీస్‌లో చేర్చాం ".
--బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ప్రతినిధి
ఆర్థిక సంక్షోభం, జింబాబ్వే క్రికెట్ బోర్డులో ఆ దేశ ప్రభుత్వం మితిమీరిన జోక్యం చేసుకుంటోందన్న కారణాలతో ఆఫ్రికా జట్టుపై ఐసీసీ నిషేధం విధించింది. ఆర్టికల్ 2.4(సి), (డి) నిబంధనలను అతిక్రమించినందుకు శాశ్వత సభ్యదేశమైన జింబాబ్వేపై వేటు వేసింది అంతర్జాతీయ క్రికెట్ మండలి. అయితే బంగ్లాదేశ్‌లో సెప్టెంబర్ 13 నుంచి 24 వరకు జరగనున్న ట్రై సిరీస్‌లో జింబాబ్వే ఆటగాళ్లు ఆడేందుకు అవకాశం దక్కింది. బంగ్లాతో పాటు జింబాబ్వే, అఫ్గానిస్థాన్ జట్లు ఇందులో పాల్గొననున్నాయి. ఈ టీ-20 సిరీస్ కంటే ముందు సెప్టెంబర్ 5న అఫ్గాన్‌తో ఏకైక టెస్ట్ ఆడనుంది బంగ్లాదేశ్.
టీ20 త్రైపాక్షిక సిరీస్ షెడ్యూల్ ఇదే...
ఇవీ చూడండి...'క్రికెట్ కిట్లు కాల్చేసి జాబ్ వెతుక్కోవాలి'