తెలంగాణ

telangana

ETV Bharat / sports

క్రికెటర్లకు శిక్షణ ప్రారంభించిన బంగ్లా క్రికె​ట్​ బోర్డు

ఆదివారం నుంచి బంగ్లాదేశ్​ క్రికెటర్లకు శిక్షణా శిబిరాన్ని ప్రారంభించింది ఆ దేశ క్రికెట్​ బోర్డు. నాలుగు క్రికెట్​ స్టేడియాలు ఎంచుకుని అందులో ఆరోగ్యభద్రత చర్యలను పాటిస్తూ ట్రైనింగ్​ను నిర్వహిస్తోంది. క్రికెటర్ల శిక్షణలో ఒకరి తర్వత మరొకరిని మాత్రమే లోపలికి అనుమతించే విధంగా కట్టుదిట్టమైన ప్రణాళిక రచించింది బంగ్లా క్రికెట్​ బోర్డు.

Bangladesh cricketers resume individual training
క్రికెటర్లకు శిక్షణ ప్రారంభించిన బంగ్లాదేశ్​ క్రికె​ట్​ బోర్డు

By

Published : Jul 19, 2020, 9:44 PM IST

దాదాపు నాలుగు నెలల కరోనా లాక్​డౌన్​ విరామం తర్వాత మైదానంలో ప్రాక్టీసు మొదలెట్టారు బంగ్లాదేశ్​ క్రికెటర్లు​. జులై 19 నుంచి బంగ్లా​ క్రికెటర్లకు శిక్షణా శిబిరాన్ని ప్రారంభించింది ఆ దేశ క్రికెట్​ బోర్డు. అందులో తొమ్మిది మంది క్రికెటర్లు పాల్గొన్నారు.

నాలుగు స్టేడియాలు

బంగ్లా క్రికెటర్లకు విరివిగా శిక్షణ ప్రారంభించడానికి నాలుగు స్డేడియాలను బంగ్లా క్రికెట్​ బోర్డు ఎంపిక చేసింది. ఢాకాలోని షేర్​-ఏ-బంగ్లా జాతీయ క్రికెట్​ స్టేడియం, చిట్టగాంగ్​లోని జహూర్​ అహ్మద్​ చౌదరీ స్టేడియం, సెల్హట్​ జాతీయ క్రికెట్​ స్డేడియం, షేక్​ అబూ నసీర్​ స్టేడియాల్లో తొలిదశ శిక్షణా శిబిరాలను ప్రారంభించింది.

ఒక్కరికి మాత్రమే!

ఈ శిక్షణ కోసం ఒకసారి ఒక క్రికెటర్​ను మాత్రమే స్డేడియం లోపలికి అనుమతిస్తారు. అతనితో ఒక ట్రైనర్​ మాత్రమే ఉంటాడు. ఇరువురు భౌతిక దూరాన్ని పాటించాలి. వారికి వేర్వేరు సీట్లు, వాటర్​ బాటిల్స్​, టాయిలెట్స్​ ఏర్పాటు చేస్తారు. ఒక ఆటగాడి ట్రైనింగ్​ పూర్తయిన తర్వాత మరో ఆటగాడిని లోపలికి అనుమతిస్తారు. స్టేడియంలోకి బోర్డు అధికారి లేదా సహాయక సిబ్బందిని అనుమతించడం లేదు.

శిక్షణలో పాల్గొన్న బంగ్లా క్రికెటర్లు

ముష్ఫికర్​ రహీమ్​ (ఢాకా), ఇమ్రుల్​ కైస్​ (ఢాకా), మహ్మద్ మిథున్​ (ఢాకా), షఫీయిల్ ఇస్లాం (ఢాకా) సయీద్ ఖలీద్​ (సెల్హాట్​), నసూమ్​ అహ్మద్​ (సెల్హట్​), నురల్​ హసన్​ (ఖుల్నా), మెహది హసన్​ (ఖుల్నా), నయీమ్​ హసన్​ (చిట్టగాంగ్​)

వాయిదా పడిన సిరీస్​లు

బంగ్లాదేశ్ చివరిసారిగా ఈ ఏడాది మార్చిలో జింబాబ్వేతో వన్డే, టీ20 సిరీస్​ ఆడింది. జులైలో వెళ్లాల్సిన శ్రీలంక పర్యటన కరోనా కారణంగా వాయిదా పడింది. మరోవైపు న్యూజిలాండ్​తో జరగాల్సిన రెండు టెస్టులూ వాయిదా పడ్డాయి.

ABOUT THE AUTHOR

...view details