వచ్చే నెలలో జరగబోయే భారత్-బంగ్లాదేశ్ సిరీస్ సందిగ్ధంలో పడింది. బంగ్లా జట్టు సభ్యులు నిరవధిక సమ్మెకు దిగడమే అందుకు కారణం.
కొంతకాలంగా స్థానిక దినపత్రికలకు ఇస్తున్న ఇంటర్వ్యూలలో కెప్టెన్ షకిబుల్ హసన్‌తో పాటు ఇతర క్రికెటర్లు తమ బాధలు వెల్లడించేవారు. కొన్నిసార్లు ఇబ్బందులకు గురువుతున్నామని చెప్పుకునేవారు.
సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలు విషయాలు పంచుకున్నారు బంగ్లా క్రికెటర్లు. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ ఫార్మాట్‌ను మార్చకుండా, పాత పద్ధతినే కొనసాగించాలని డిమాండ్ చేశారు. దేశవాళీ క్రికెటర్ల జీతాలని పెంచాలని కోరారు. కానీ ఈ విషయాలను బీసీబీ పట్టించుకోకపోవడం వల్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు బంగ్లా ఆటగాళ్లు.
సమ్మె చేస్తున్న బంగ్లాదేశ్ క్రికెటర్లు వచ్చే నెల 3న బంగ్లాదేశ్.. భారత పర్యటనకు రావల్సి ఉంది. ఇందులో భాగంగా మూడు టీ20లు, రెండు టెస్టులు ఆడనుంది. అయితే బంగ్లా క్రికెటర్లు ప్రస్తుతం సమ్మెకు దిగడం వల్ల.. ఇది జరుగుతుందా లేదా అనేది అనుమానంగా మారింది. ఒకవేళ వారి సమస్యలు పరిష్కరించకపోతే సిరీస్ రద్దయ్యే పరిస్థతి ఉంది.
ఇది చదవండి: వైరల్: మ్యాచ్ మధ్యలో మైదానంలోకి అభిమాని