బంగ్లాదేశ్ కెప్టెన్ షకిబుల్ హసన్ చిక్కుల్లో పడ్డాడు. అయితే జాతీయ కాంట్రాక్టును ఉల్లంఘించిన కారణంగా అతడిపై వేటు పడనుంది.టీమిండియా పర్యటనకు రానున్న నేపథ్యంలో ఈ విషయం ఆ జట్టును కలవరపెడుతోంది.
"బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు(బీసీబీ) నిబంధనల ప్రకారం బోర్డుతో సెంట్రల్ కాంట్రాక్ట్‌లో ఉన్న ఆటగాడు ఏ టెలికాం సంస్థతోనూ ఒప్పందం చేసుకోకూడదు. మా దేశానికి చెందిన ప్రాంతీయ టెలికాం సంస్థ గ్రామీణఫోన్.. తమ బ్రాండ్ అంబాసిడర్‌గా షకిబ్‌తో ఒప్పందం చేసుకున్నట్లు ఈనెల 22న ప్రకటించింది. ఈ విషయంపై షకీబ్‌ను వివరణ కోరాం. ఒకవేళ బోర్డు నిబంధనల్ని ఉల్లఘించినట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటాం. టెలికాం సంస్థ ఒప్పందంపై చట్టపరమైన చర్యలు తీసుకోబోతున్నాం. కాంట్రాక్ట్ కుదుర్చుకున్న ఆటగాడితో పాటు కంపెనీ నుంచి నష్టపరిహారాన్ని కోరతాం"