బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్ షకిబుల్ హసన్పైరెండేళ్ల పాటు అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) నిషేధం విధించింది. ఈ విషయంపై సానుభూతి వ్యక్తం చేశారు ఆ దేశ ప్రధాని షేక్ హసీనా. షకిబ్ తప్పు చేశాడని, అయినా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అతడికి మద్దతుగా నిలవాలని కోరారు. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
"షకిబ్ తప్పు చేశాడని స్పష్టంగా తెలుస్తోంది. ఆ విషయం మేం అర్థం చేసుకోగలం. ఐసీసీ నిర్ణయంపై ప్రభుత్వం ఏం చేయలేదు. కానీ బీసీబీ అతడికి(షకిబ్) మద్దతుగా నిలవాలి" - షేక్ హసీనా, బంగ్లాదేశ్ ప్రధాని.
అయితే షకిబ్ వ్యవహారం గురించి బీసీబీకి ఏం తెలియదని చెప్పాడు బంగ్లా బోర్డు అధ్యక్షుడు నజ్ముల్ హసన్.