బంగ్లాదేశ్ వేదికగా ఆసియా ఎలెవన్, ప్రపంచ ఎలెవన్ జట్లు.. వచ్చే నెలలో రెండు టీ20లు ఆడనున్నాయి. మార్చి 18 నుంచి 21 తేదీల మధ్య ఈ సిరీస్ నిర్వహించనుంది బంగ్లా క్రికెట్ బోర్డు. తాజాగా ఇరుజట్ల జాబితాను ప్రకటించింది బీసీబీ.
ఆసియా ఎలెవన్:
కేఎల్ రాహుల్(ఒక మ్యాచ్‌కు), విరాట్ కోహ్లీ(కెప్టెన్)*, శిఖర్ ధావన్, రిషభ్ పంత్, మహ్మద్ షమి, కుల్దీప్ యాదవ్, లిటన్ దాస్, తమీమ్ ఇక్బాల్, ముష్ఫికర్ రహీమ్, తిశార పెరెరా, రషీద్ ఖాన్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, సందీప్ లామిచన్నే, లసిత్ మలింగ, ముజీబ్ ఉర్ రెహ్మన్
వరల్డ్ ఎలెవన్:
అలెక్స్ హేల్స్, క్రిస్ గేల్, డుప్లెసిస్(కెప్టెన్), నికోలస్ పూరన్, రాస్ టేలర్, జానీ బెయిర్ స్టో, కీరన్ పోలార్డ్, అదిల్ రషీద్, షెల్డన్ కాట్రెల్, లుంగీ ఎంగిడి, ఆండ్రూ టై, మిచెల్ మెక్లెగన్
ఆసియా ఎలెవన్‌లో ఆరుగురు భారతీయులు పింక్ టెస్టుకు మద్దతు వల్లే...
గతేడాది నవంబర్‌లో భారత్-బంగ్లా మధ్య చారిత్రక డే/నైట్ టెస్టు జరిగింది. గులాబి బంతితో ఇరుజట్లు తొలిసారి ఆడాయి. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌కు.. ముఖ్య అతిథిగా బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా వచ్చారు. ఇందుకు కృతజ్ఞతగా బీసీబీ నిర్వహిస్తున్న ఆసియా ఆల్‌స్టార్ ఎలెవన్, ప్రపంచ ఆల్‌స్టార్ ఎలెవన్.. రెండు టీ20ల సిరీస్‌కు హాజరవుతానని దాదా హామీ ఇచ్చాడు. భారత ఆటగాళ్లనూ పంపుతానని చెప్పాడు. బంగ్లాదేశ్ పితామహుడు, బంగబంధు షేక్ ముజిబుర్ రెహ్మాన్ 100వ వార్షికోత్సవం సందర్భంగా ఈ మ్యాచ్‌ను నిర్వహిస్తోంది బంగ్లా బోర్డు.
ఇవీ చదవండి..
పింక్ టెస్టు: ఈడెన్ తోటలో.. 'గులాబి' మనదేగులాబి ఆటతో.. గుర్తుండిపోయే రికార్డులు