అండర్ 19 ప్రపంచకప్ ఫైనల్లో గెలిచిన బంగ్లాదేశ్.. తొలిసారి కప్పును ముద్దాడింది. డిఫెండింగ్ ఛాంపియన్ టీమిండియాపై 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. బంగ్లా ఆటగాళ్లు సమష్టిగా రాణించడం వల్ల భారత్ ఓటమి పాలైంది. ఈ టోర్నీ తుదిపోరు అర్హత సాధించిన తొలిసారే విజేతగా నిలిచింది బంగ్లా.
ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్.. 47.2 ఓవర్లలో అన్ని వికెట్లు కోల్పోయి 177 పరుగులు చేసింది. బంగ్లా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడం వల్ల మన బ్యాట్స్మెన్.. పరుగులు చేయడంలో తడబడ్డారు. ఓపెనర్ యశస్వి జైస్వాల్(88) మినహా అందరూ తక్కువ స్కోర్లకే పరిమితమయ్యారు.
178 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ జట్టుకు ఓపెనర్లు శుభారంభం ఇచ్చారు. తొలి వికెట్కు 50 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. ఈ క్రమంలో భారత బౌలర్ రవి బిష్ణోయ్.. వెంట వెంటనే నాలుగు వికెట్లు తీసి ప్రత్యర్థి జట్టులో కలవరం రేపాడు.