కాంకషన్.. ఇటీవల జరిగిన యాషెస్ సిరీస్‌లో గాయపడిన స్టీవ్ స్మిత్ స్థానంలో లబూషేన్‌ను ఆడించారు. ఐసీసీ తీసుకొచ్చిన ఈ నూతన విధానాన్ని ఇప్పుడు బంగ్లాదేశ్ కూడా వినియోగించుకుంది. ఈడెన్‌గార్డెన్స్ వేదికగా భారత్‌తో జరుగుతున్న డేనైట్ టెస్టులో ఇద్దరు బంగ్లా క్రికెటర్లు కాంకషన్‌కు గురయ్యారు.
మహ్మద్ షమీ బౌలింగ్‌లో బంగ్లా క్రికెటర్ లిటన్ దాస్ గాయపడ్డాడు. షమీ వేసిన 21వ ఓవర్లో అతడు సంధించిన బౌన్సర్.. బ్యాట్స్‌మెన్ హెల్మెట్‌ను బలంగా తాకింది. బాధతో లిట్టన్ దాస్ విలవిల్లాడాడు. ఫిజియో వచ్చి పరీక్షించినా.. నొప్పి తగ్గకపోవడం వల్ల అంపైర్లు లంచ్ బ్రేక్ ఇచ్చారు. అనంతరం అతడి స్థానంలో మెహదీ హసన్‌ను కాంకషన్‌గా తీసుకుంది బంగ్లాదేశ్.
మరో ఆటగాడు నయీమ్ హసన్ కూడా కాంకషన్‌కు గురయ్యాడు. అతడి స్థానంలో తైజుల్ ఇస్లామ్‌ను తీసుకున్నారు. ఇతడు కూడా షమీ బౌలింగ్‌లోనే గాయపడడం గమనార్హం.
గాయపడిన లిట్టన్ దాస్‌ను కోల్‌కతాలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. తలకు బలమైన గాయం కారణంగా లిట్టన్ దాస్‌కు సిటీ స్కాన్, తదితర పరీక్షలు చేశారు వైద్యులు.