తెలంగాణ

telangana

ETV Bharat / sports

పెళ్లి దుస్తుల్లో మహిళా క్రికెటర్ ఫోజులు.. నెట్టింట వైరల్​ - wedding in cricket

వెడ్డింగ్​ ఫొటో షూట్స్​ అంటే.. ఏ నదీ తీరాల్లోనో, అందమైన లొకేషన్లలోనో నవ వధువులు ఫొటోలు తీసుకుంటారు. కానీ, ఓ క్రీడాకారిణి మాత్రం తనకిష్టమైన క్రికెట్​ గ్రౌండ్​లో ఫోటోలు దిగింది. పెళ్లిదుస్తులు ధరించి, చేతిలో బ్యాట్ పట్టుకొని స్టిల్స్​​ ఇచ్చింది. అవి ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి.

Bangla woman cricketer's wedding photoshoot on pitch bowls out social media
బ్యాట్​ పట్టుకున్న నవ వధువు ఫోటోలకు అందరూ ఫిదా!

By

Published : Oct 21, 2020, 8:07 PM IST

సామాజిక మాధ్యమాల్లో బంగ్లాదేశ్​ మహిళా క్రికెటర్​ సంజిదా ఇస్లాం.. పెళ్లి​ ఫొటోలు తెగ వైరల్​ అవుతున్నాయి. పెళ్లి దుస్తులు ధరించి, క్రికెట్​ పిచ్​పై బ్యాట్​ పట్టుకున్న ఆమె ఫోజులకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. కవర్​ డ్రైవ్​, పుల్​ షాట్లు ఆడుతున్నట్లు ఆమె ఇచ్చిన స్టిల్స్​ క్రికెట్​ ప్రేమికులను తెగ ఆకట్టుకుంటున్నాయి. సంజిదా అదిరిపోయే ఐడియాను ట్విట్టర్​ వేదికగా ఐసీసీ(అంతర్జాతీయ క్రికెట్​ మండలి) ప్రశంసించింది.

"బట్టలు, నగలు, బ్యాట్​.. క్రికెటర్ల వెడ్డింగ్​ ఫొటో షూట్స్​ ఇలానే ఉంటాయి"

-- ఐసీసీ.

బంగ్లాలోని రంగాపుర్​కు చెందిన ప్రముఖ క్రీడాకారుడు మిమ్​ మెసద్దెక్​తో సంజిదాకు ఇటీవలే వివాహమైంది. 2012లో ఐర్లాండ్​తో జరిగిన టీ20 మ్యాచ్​తో బంగ్లాదేశ్​ తరఫున అంతర్జాతీయ క్రికెట్​లోకి అడుగు పెట్టింది సంజిదా. జూన్​, 2018లో మహిళల టీ20 ఆసియా కప్​ను బంగ్లాదేశ్​ సొంతం చేసుకోవడంలో ఆమె కీలక పాత్ర పోషించింది.

ఇదీ చూడండి:గేల్​ ఓ దెయ్యం.. రెండు కాళ్లు కట్టేయాలి!

ABOUT THE AUTHOR

...view details