బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ మరోసారి విజృంభిస్తోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లా పులులను ఆరంభంలోనే దెబ్బతీసింది. తొలి సెషన్ ముగిసే సమయానికి ప్రత్యర్థి జట్టులోని టాపార్డర్ బ్యాట్స్‌మెన్‌ను పెవిలియన్‌కు పంపారు టీమిండియా బౌలర్లు. ఇషాంత్, ఉమేశ్, షమి తలో వికెట్ తీశారు.
12 పరుగులకే ఓపెనర్ ఇమ్రుల్ కేయుస్(6) వికెట్ తీసి దెబ్బతీశాడు ఇషాంత్ శర్మ. కాసేపటికే మరో ఓపెనర్ ఇస్లామ్‌ను(6) ఔట్ చేసి బంగ్లాను కష్టాల్లో పడేశాడు ఉమేశ్ యాదవ్. అనంతరం క్రీజులో నిలదొక్కుకుంటున్న మిథున్‌ను(13) ఎల్బీడబ్ల్యూ చేశాడు షమి.