తెలంగాణ

telangana

ETV Bharat / sports

భారత్​xబంగ్లా టెస్టుకు ప్రత్యేక అతిథులు - డే అండ్ నైట్ టెస్టుకు హసీనా, మమత

భారత్​, బంగ్లా జట్ల మధ్య చారిత్రక డే అండ్​ నైట్​ టెస్టు మ్యాచ్​ ఈ నెల 22న ఆరంభం కానుంది. ఈడెన్​ గార్డెన్స్​ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్​ను బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, పశ్చిమ బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రత్యక్షంగా వీక్షించనున్నారు.

డే అండ్ నైట్ టెస్టుక బంగ్లా ప్రధాని హసీనా, మమత

By

Published : Nov 13, 2019, 8:06 AM IST

కోల్‌కతాలోని ఈడెన్‌గార్డెన్స్‌ వేదికగా భారత్‌-బంగ్లాదేశ్‌ జట్ల మధ్య ఈనెల 22న చారిత్రక డే అండ్ నైట్‌ టెస్టు మ్యాచ్​ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్​ను బంగ్లా ప్రధానమంత్రి షేక్‌ హసీనా, పశ్చిమ బంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రత్యక్షంగా వీక్షించనున్నారు.

బంగ్లా డిప్యూటీ హైకమిషనర్‌ బృందం మంగళవారం ఈడెన్‌ను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించింది. మ్యాచ్‌ ఆరంభానికి ఒక రోజు ముందు భారత్‌కు రాబోతున్న హసీనా.. మమతతో కలిసి గంట కొట్టి టెస్టును ప్రారంభించనున్నారు.

రెండు టెస్టుల సిరీస్​లో గురువారం ఇరు జట్ల మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే మూడు టీ20ల సిరీస్​ను 2-1 తేడాతో టీమిండియా కైవసం చేసుకుంది.

ఇదీ చదవండి: బ్యాడ్మింటన్​ టాప్​-10​ ర్యాంకింగ్స్​లో సాత్విక్​-చిరాగ్​

ABOUT THE AUTHOR

...view details