తెలంగాణ

telangana

By

Published : Nov 9, 2019, 3:38 PM IST

Updated : Nov 9, 2019, 3:47 PM IST

ETV Bharat / sports

ఫుట్​బాల్​ ప్లేయర్​గా మారిన షకిబుల్​ హసన్​

బంగ్లాదేశ్​ స్టార్​ ఆల్​రౌండర్​ షకిబుల్​ హసన్​పై ఇటీవల రెండేళ్ల నిషేధం విధించింది అంతర్జాతీయ క్రికెట్​ మండలి(ఐసీసీ). తాజాగా ఈ క్రికెటర్.. ఫుట్​బాల్​ ఆడుతూ కనిపించాడు. ఢాకాలో జరిగిన సాకర్​ మ్యాచ్​లో ఫూటీ హ్యాగ్స్​ జట్టు తరఫున బరిలోకి దిగాడు.

ఫుట్​బాల్​ ప్లేయర్​గా మారిన షకిబుల్​ హసన్​

బంగ్లాదేశ్​ మాజీ సారథి షకిబుల్​ హసన్​... రెండేళ్ల పాటు క్రికెట్​ ఆడకుండా నిషేధం విధించింది అంతర్జాతీయ క్రికెట్​ మండలి(ఐసీసీ). తనను ఓ బుకీ సంప్రదించినా ఆ విషయాన్ని దాచి పెట్టడమే ఇందుకు కారణం.

ఏ క్రికెటరైనా మంచి ఫామ్​లో ఉన్నప్పుడు ఆటకు దూరమైతే భవిష్యత్తు గురించి ఆలోచిస్తాడు. ప్రస్తుతం షకిబుల్​ అదే పనిలో ఉన్నట్లున్నాడు.

ఇటీవలే ఢాకా వేదికగా ఫూటీ హ్యాగ్స్​, కొరియన్​ ఎక్స్​పాట్​ మధ్య జరిగిన ఫుట్​బాల్ మ్యాచ్​లో షకిబ్..​ ఆటగాడిగా బరిలోకి దిగాడు. ఫూటీ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.

ఫూటీ హ్యాగ్స్ తరఫున షకిబుల్​ హసన్​(ఎడమ వైపు వెనుక వరుసలో చివరన)

"ఆర్మీ స్టేడియంలో కొరియన్​ ఎక్సపాట్​ జట్టుకు ప్రత్యర్థులుగా మేము(ఫూటీ హ్యాగ్స్) 11 మందితో బరిలోకి దిగాం. 3-2 తేడాతో గెలిచాం. ఫూటీ హ్యాగ్స్​ తరఫున షకీబ్​ అడటం ఆనందంగా ఉంది"
-- ఫూటీ హ్యాగ్స్​ పోస్టు

ప్రపంచ ఆల్​రౌండర్ల జాబితాలోప్రస్తుతం తొలిస్థానంలో ఉన్నాడు షకిబ్​. రెండేళ్ల నిషేధం కారణంగా వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్​నకు దూరమయ్యాడు. భారత్‌తో టీ20, టెస్టు సిరీస్​కు ఈ క్రికెటర్​ లేకుండానే బరిలోకి దిగింది బంగ్లాదేశ్‌ జట్టు.

ఇరుజట్ల మధ్య జరుగుతున్న టీ20 సిరీస్‌ 1-1తో సమమైంది. నిర్ణయాత్మక మ్యాచ్‌ నాగ్​పూర్​ వేదికగా ఆదివారం(నవంబర్​ 10న) జరగనుంది.

నవంబర్​ 14-19(ఇండోర్), 22-26(ఈడెన్​ గార్డెన్స్)లలో​ రెండు టెస్టులు జరగనున్నాయి. కోల్​కతాలో తొలిసారి డే/నైట్​ టెస్టు ఆడనున్నాయి ఇరుజట్లు.

Last Updated : Nov 9, 2019, 3:47 PM IST

ABOUT THE AUTHOR

...view details