తెలంగాణ

telangana

ETV Bharat / sports

బెంగళూరు గెలుపు.. హైదరాబాద్​కు ప్లేఆఫ్​ సంక్లిష్టం - sunrisers hyderabad

బెంగళూరు వేదికగా సన్​రైజర్స్​తో జరిగిన మ్యాచ్​లో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ విజయం సాధించింది. గెలుపుతో సీజన్​ను ముగించింది.

ఐపీఎల్

By

Published : May 4, 2019, 11:59 PM IST

ఇప్పటికే ప్లేఆఫ్ నుంచి నిష్క్రమించిన బెంగళూరు చివరి మ్యాచ్​లో గెలిచి సీజన్​ను ముగించింది. హైదరాబాద్​ సన్​రైజర్స్​పై 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. బెంగళూరు బ్యాట్స్​మెన్​ హిట్మైర్​, గుర్​కీరత్​ అర్ధశతకాలతో ఆకట్టుకున్నారు.

176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు ఆదిలోనే పార్థివ్ పటేల్ వికెట్ కోల్పోయింది. కాసేపటికే సారథి కోహ్లి (18) పెవిలియన్ చేరాడు. డివిలియర్స్ (1) సైతం విఫలమయ్యాడు. 20 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది బెంగళూరు.

నాలుగో వికెట్​కు రికార్డు భాగస్వామ్యం

అనంతరం వచ్చిన హిట్మైర్​ దూకుడుగా ఆడి అర్ధశతకం సాధించాడు. ఐపీఎల్​లో అతడికిది తొలి అర్ధశతకం. మరోవైపు గుర్​కీరత్​ సింగ్ కుడా అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. వీరిద్దరూ బౌండరీలతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. తర్వాత భారీ షాట్​ ఆడబోయి హిట్మైర్​ 75 పరుగుల (47 బంతుల్లో 6 సిక్సులు, 4 ఫోర్లు) వ్యక్తిగత స్కోరు వద్ద ఔటయ్యాడు. వీరిద్దరూ నాలుగో వికెట్​కు 144 పరుగులు సాధించారు.

అనంతరం 65 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద గుర్​కీరత్​​ కూడా పెవిలియన్ బాట పట్టాడు. అప్పటికీ బెంగళూరు విజయానికి 10 బంతుల్లో 9 పరుగులు కావాల్సి ఉంది. చివరి ఓవర్లో 6 పరుగులు అవసరం కాగా మొదటి రెండు బంతులకి రెండు ఫోర్లు కొట్టి ఉమేష్ యాదవ్ బెంగళూరుకు విజయాన్నందించాడు.

సన్​రైజర్స్ బౌలర్లలో ఖలీల్ అహ్మద్ మూడు వికెట్లు తీయగా, భువనేశ్వర్ రెండు, రషీద్ ఖాన్ 1 వికెట్ తీసుకున్నారు.

విలియమ్సన్ అండతో..

మొదటగా టాస్ ఓడి బ్యాటింగ్​కు దిగిన సన్​రైజర్స్​ నిర్ణీత 20 ఓవర్లలో 175 పరుగులు సాధించింది. ఓపెనర్లు 4.3 ఓవర్లలోనే 46 పరుగులు సాధించిన అనంతరం సాహా (20) ఔటయ్యాడు. గప్తిల్ (30) కాసేపు మెరిపించాడు. ఫామ్​లో ఉన్న మనీష్ పాండే కూడా (9) విఫలమవగా.. సన్​రైజర్స్ 61 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. విజయ్ శంకర్ (27) పరుగులు కాసేపు మెరిశాడు. సారథి విలియమ్సన్ 43 బంతుల్లో 4 సిక్సులు 5 ఫోర్లతో 70 పరుగులు సాధించి జట్టు గౌరవప్రదమైన స్కోర్ సాధించడానికి కారణమయ్యాడు.

బెంగళూరు బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ మూడు వికెట్లు తీశాడు. సైనీ 2, చాహల్, కుల్వంత్ తలో వికెట్ పడగొట్టారు.

ABOUT THE AUTHOR

...view details