చెన్నై ఆటగాళ్లు తమలోని కళను ప్రదర్శించేందుకు ప్రయత్నించారు. వీరిలో హర్భజన్ ఆకట్టుకున్నాడు. బంతినే గింగిరాలు తిప్పడం కాదు కర్రనూ తిప్పగలనంటూ కర్రసాము చేసి చూపించాడు. మొదట ఒంటి చేత్తో కర్రసాము చేసిన భజ్జీ.. తర్వాత రెండు చేతులతోనూ కర్రను తిప్పుతూ అలరించాడు.
కర్ర సాము కాంటెస్ట్.. భజ్జీ అదరగొట్టేశాడు - ఐపీఎల్2019
చెన్నై సూపర్‌కింగ్స్ ఆటగాళ్లు మ్యాచ్ తర్వాత ఖాళీ సమయాల్లో సరదాగా గడుపుతుంటారు. ఈ రోజు ఓ చిన్నపాటి కర్రసాము పోటీ నిర్వహించుకున్నారు. ఇందులో బౌలర్ హర్భజన్ సింగ్ తనదైన శైలిలో అందరినీ మెప్పించాడు.
కర్ర సాము కాంటెస్ట్.. భజ్జీ అదరగొట్టేశాడు
ఇటీవల గాయంతో బాధపడి ఆటకు దూరమైన బ్రావో.. సహ ఆటగాడికి హెయిర్ స్టయిలిస్ట్‌గా కనువిందు చేశాడు. ఇలాంటి ఖాళీ సమయాల్లో బృందంగా ఏర్పడి సరదాగా గడుపుతుంటారు ఆటగాళ్లు. అంతే కాకుండా వారితో పాటు కుటుంబ సభ్యులను వెంట తీసుకెళ్తూ సందడి చేస్తుంటారు.