రోహిత్ శర్మతో విభేదాలు ఉన్నాయంటూ వస్తోన్న కథనాలను ఖండించాడు టీమిండియా సారథి విరాట్ కోహ్లీ. ఇలాంటి ఊహాగానాలు రావడం దారుణమని తెలిపాడు. రోహిత్‌తో తనకు ఎలాంటి విభేదాలు లేవని, అబద్ధాలను నమ్మొద్దని చెప్పాడు కోహ్లీ.
"నా అభిప్రాయం ప్రకారం ఈ కథనాలు అనవసరమైనవి. చాలా దారుణంగా ఉన్నాయి. అబద్ధాలను పెంచి పోషిస్తున్నారు. రోహిత్‌తో నాకు ఎలాంటి విభేదాలు లేవు. ఒకవేళ నేను ఎవరినైనా ఇష్టపడకపోతే అది నా ముఖంలో స్పష్టంగా కనిపిస్తుంది. కొన్ని రోజులుగా చాలా వార్తలు విన్నా. ఒకవేళ అవే నిజమైతే జట్టులో పరిస్థితులు సరిగా ఉండేవి కావు. మేము మంచి ప్రదర్శన చేసే వాళ్లం కాదు" - విరాట్ కోహ్లీ, టీమిండియా కెప్టెన్