బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో టీ20లో హ్యాట్రిక్ సహా ఆరు వికెట్లతో ఆకట్టుకున్న దీపక్ చాహర్‌పై టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ సరదాగా వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. ఆదివారం నాగ్‌పుర్ వేదికగా జరిగిన మ్యాచ్ అనంతరం చాహల్.. దీపక్, శ్రేయస్ అయ్యర్‌ను ఇంటర్వ్యూ చేశాడు. దీపక్ నిర్ధాక్షిణ్యంగా తన రికార్డు బ్రేక్ చేశాడని అతడిపై ఫన్నీ కౌంటర్ వేశాడు.
"ఇవాళ ఇతడి(దీపక్) బౌలింగ్ గురించి ఏం చెప్పాలి. నీకు(దీపక్) దయ లేదు.. నిర్ధాక్షిణ్యంగా నా రికార్డు బ్రేక్ చేశావు(ఆజ్ మేరా రికార్డు తోడ్ దియా, బడే బేషారమ్ ఆద్మీ హో యార్ తుమ్)" -చాహల్, టీమిండియా బౌలర్
పక్కనే ఉన్న దీపక్ వెంటనే చాహల్ వ్యాఖ్యలపై స్పందించాడు.
"నిజంగా అద్భుతంగా అనిపిస్తుంది. నువ్వు(చాహల్) ఇంట్లో కూర్చొని టీవీ చూస్తున్నట్లయితే.. ఈ రికార్డు (7పరుగులకు 6వికెట్లు) సాధిస్తావని నువ్వు కూడా అనుకుని ఉండవు" - దీపక్ చాహర్, టీమిండియా బౌలర్.
2017 ఇంగ్లాండ్‌పై చాహల్ 25 పరుగులిచ్చి ఆరు వికెట్లు తీసి భారత్ తరఫున అత్యుత్తమ గణాంకాలు నెలకొల్పాడు. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో దీపక్ ఈ రికార్డును బ్రేక్ చేశాడు.
బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో టీ20లో దీపక్ చాహర్ 3.2 ఓవర్లు బౌలింగ్ చేసి 7 పరుగులు ఇచ్చి 6 వికెట్లతో ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. శ్రీలంక క్రికెటర్ అజంతా మెండిస్(6/8) రికార్డును బద్దలు కొట్టాడు. టీ20ల్లో హ్యాట్రిక్ వికెట్లు తీసిన 12వ క్రికెటర్‌గా, పురుషుల క్రికెట్లో తొలి భారతీయుడిగా ఘనత సాధించాడు దీపక్.
ఇదీ చదవండి: షెఫాలి, దీప్తి విజృంభణ.. విండీస్‌పై భారత్ ఘనవిజయం