పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. వన్డేల్లో వేగంగా 13 సెంచరీలు చేసిన బ్యాట్స్‌మెన్‌గా సరికొత్త ఫీట్ సాధించాడు. ఈ క్రమంలో దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ హషీమ్ ఆమ్లాతో పాటు, భారత కెప్టెన్ విరాట్ కోహ్లీని దాటేశాడు.
78 వన్డేలు ఆడిన బాబర్ కేవలం 76 ఇన్నింగ్స్‌లోనే ఈ ఘనత సాధించాడు. 13 శతకాలు చేయడానికి ఆమ్లాకు 83 ఇన్నింగ్స్ పట్టగా.. కోహ్లీ 86 ఇన్నింగ్స్‌లో చేరుకున్నాడు.