మూడు ఫార్మాట్లకు బాబర్ కెప్టెన్.. పాక్ బోర్డు ప్రకటన - babar azam recent update
పాకిస్థాన్ యువ క్రికెటర్ బాబర్ అజామ్ మూడు ఫార్మాట్లకు కెప్టెన్ అయ్యాడు. ఈ మేరకు పగ్గాలు అప్పగిస్తూ ఇవాళ ప్రకటన చేసింది పీసీబీ.
బాబర్ అజామ్
పాకిస్థాన్ క్రికెటర్ బాబర్ అజామ్ అరుదైన ఘనత సాధించాడు. దాయాది జట్టు తరఫున మూడు ఫార్మట్లకు సారథిగా వ్యవహరించనున్నాడు. ఈ మేరకు బాబర్‌కు కీలక పగ్గాలు అప్పగించింది పీసీబీ. నేడు ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది. ఇటీవలే ఇతడి సారథ్యంలోని కరాచీ కింగ్స్ తొలిసారి పీఎస్ఎల్ ట్రోఫీని అందుకుంది.