పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. కరాచీ కింగ్స్-క్వెట్టా గ్లాడియేటర్స్ మధ్య ఆదివారం జరిగిన మ్యాచ్‌లో బ్యాట్‌ను తిప్పి పట్టుకుని పరుగు పూర్తి చేశాడు వికెట్ కీపర్ ఆజమ్ ఖాన్. ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
బ్యాట్ తిరగేసి పరుగు పూర్తి చేసిన పాక్ క్రికెటర్ - అజమ్ ఖాన్ బ్యాట్ తిరగేసి చేసిన పరుగు వైరల్
పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో ఆదివారం జరిగిన ఓ మ్యాచ్‌లో వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ అజమ్ ఖాన్ పరుగు వైరల్‌గా మారింది. అదేంటో మీరు చూసేయండి.
![బ్యాట్ తిరగేసి పరుగు పూర్తి చేసిన పాక్ క్రికెటర్ azam khan](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6188207-thumbnail-3x2-rk.jpg)
బ్యాట్ తిరగేసి పరుగు పూర్తి చేసిన పాక్ క్రికెటర్
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కరాచీ కింగ్స్.. 9వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. ఛేదనలో క్వెట్టా గ్లాడియేటర్స్.. 19 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. క్వెట్టా తరఫున ఆజమ్ 46, కెప్టెన్ సర్ఫరాజ్ 37, వాట్సన్ 27 పరుగులు చేసి గెలుపులో కీలక పాత్ర పోషించారు.
ఇదీ చూడండి : ఎవరు ఏమనుకుంటున్నారో పట్టించుకోను: కోహ్లీ
Last Updated : Mar 2, 2020, 10:34 AM IST