భారత్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్.. అరంగేట్ర టెస్టు సిరీస్‌లోనే అదరగొట్టాడు. మొత్తం 27 వికెట్లు పడగొట్టి.. భారత మాజీ ఆటగాడు దిలీప్ దోషీ రికార్డును సమం చేశాడు.
దిలీప్ ఆరు మ్యాచుల్లో 27 వికెట్లు తీయగా.. అక్షర్ కేవలం 3 టెస్టుల్లోనే ఈ ఘనత సాధించాడు.
ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టెస్టుతోనే సుదీర్ఘ ఫార్మాట్లో అరంగేట్రం చేశాడీ లెఫ్టార్మ్ స్పిన్నర్. ఆ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీశాడు. మూడో టెస్టులోనూ తొలి ఇన్నింగ్స్‌లో 6, రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీశాడు.
చివరి టెస్టులోనూ తొలి ఇన్నింగ్స్‌లో 4, రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు పడగొట్టాడు. మొత్తం 27 వికెట్లతో తొలి సిరీస్‌నే చిరస్మరణీయంగా మలుచుకున్నాడు.