ప్రస్తుతం భారత సైన్యం పారా రెజిమెంట్‌లో లెఫ్టినెంట్ కల్నల్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ. అందుకోసం రెండు నెలలు పాటు క్రికెట్‌కు విశ్రాంతి తీసుకున్నాడు. విధులు ముగించుకుని ఇంటికి చేరేసరికి ధోనీకి.. ఓ బహుమతిని సిద్ధం చేసింది అతడి సతీమణి సాక్షి సింగ్.
"మొత్తానికి నీకిష్టమైన రెడ్‌బీస్ట్ ఇంటికొచ్చింది. మహీ నిన్ను చాలా మిస్సవుతున్నా. భారత్‌లో ఈ మోడల్ కారు ఇదే మొదటిది అవ్వడం వల్ల దాని పౌరసత్వం కోసం ఎదురుచూస్తున్నా". -ఇన్‌స్టాగ్రామ్‌లో సాక్షి సింగ్