ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ అంటే వెంటనే గుర్తొచ్చేవి రెండే టోర్నీలు. ఒకటి యాషెస్, రెండోది బోర్డర్-గావస్కర్ ట్రోఫీ. ఈ రెండూ ఆ జట్టుకు ఎంతో ప్రతిష్ఠాత్మకం. ఇంగ్లాండ్‌తో యాషెస్‌లో తలపడితే టీమ్‌ఇండియాతో బోర్డర్-గావస్కర్ ట్రోఫీ ఆడుతుంది కంగారూల జట్టు. ఈ రెండు సిరీస్‌లు అటు క్రీడాకారులకే కాకుండా ఇటు అభిమానులకు కూడా ఎంతో మజానిస్తాయి. ఈ నేపథ్యంలోనే గురువారం నుంచి ఇరుజట్లూ మరోసారి తలపడేందుకు సిద్ధపడ్డాయి. ఈ సందర్భంగా సిరీస్ గణాంకాలను ఓసారి చూద్దాం.
ఆస్ట్రేలియాపై మొదటి సిరీస్ విజయం
భారత్-ఆస్ట్రేలియా మధ్య తొలి సిరీస్ 1947లో జరిగింది. ఈ సిరీస్ను 0-4 తేడాతో చేజార్చుకుంది భారత్. తర్వాత 32 ఏళ్లకు 1979లో కంగారూలపై సిరీస్ విజయం సాధించి చరిత్ర సృష్టించింది టీమ్ఇండియా. ఆరు మ్యాచ్ల సిరీస్ను 2-0 తేడాతో కైవసం చేసుకుంది. మొత్తంగా ఆసీస్తో 98 టెస్టులు ఆడిన భారత జట్టు 28 మ్యాచ్ల్లో మాత్రమే విజయం సాధించింది. ఇందులో 27 డ్రాగా ముగిశాయి.
టెస్టు టైతో మరో రికార్డు
1986లో చెన్నై వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన తొలి టెస్టు టైగా ముగిసింది. 348 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన టీమ్ఇండియా 347 పరుగులు చేసింది. దీంతో మ్యాచ్ టైగా ముగిసింది. క్రికెట్ చరిత్రలో టెస్టు మ్యాచ్ టైగా ముగియడం ఇది రెండోసారి మాత్రమే. 1960లో ఆస్ట్రేలియా-వెస్టిండీస్ మధ్య జరిగిన మ్యాచ్ కూడా టై అయింది.
ఆస్ట్రేలియా గడ్డపై పేలవ రికార్డు