కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్‌తో దాదాపు 6నెలల పాటు నిలిచిపోయిన క్రికెట్ కార్యకలాపాలు పునఃప్రారంభమవుతున్నాయి. ఈ క్రమంలోనే బయో సెక్యూర్ వాతావరణంలో నిర్వహించే మూడు టీ20, మూడు వన్డే మ్యాచ్‌ల కోసం ఆస్ట్రేలియా జట్టు ఇంగ్లాండ్ పర్యటనకు సిద్ధమైంది. సెప్టెంబరు 4న తొలి మ్యాచ్ జరిగే అవకాశం ఉందని అధికారిక వర్గాలు తెలియజేశాయి.
మాంచెస్టర్‌లోని సౌతాంప్టన్, ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా ఈ సిరీస్‌ను నిర్వహించే అవకాశం ఉంది. దీనికోసం ఆసీస్ జట్టు ప్రైవేట్ విమానంలో ఇంగ్లాండ్‌కు చేరుకోనుంది. పర్యటనలో మొత్తం ఆరు మ్యాచ్‌లు జరగనున్నాయి. సెప్టెంబరు 4,6,8 తేదీల్లో టీ20లు, 10,12,15 తేదీల్లో వన్డేలను నిర్వహించనున్నట్లు స్థానిక పత్రిక తెలిపింది.