ఆస్ట్రేలియా వికెట్ కీపర్ అలెక్స్ కారే.. అద్భుతంగా క్యాచ్ పట్టిన ఓ వీడియో ఆకట్టుకుంటోంది. దేశవాళీ టోర్నీ షెఫీల్డ్ షీల్డ్‌లో క్వీన్స్‌ల్యాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ సంఘటన జరిగింది.
క్వీన్స్లాండ్ ఓపెనర్ మ్యాట్ రెన్షా.. లెగ్‌సైడ్ పడిన బంతిని ఫ్లిక్ చేయగా.. కుడి వైపు డైవ్ చేస్తూ అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు కారే. సహ ఆటగాళ్లతో పాటు వీక్షకులు ఆశ్చర్యపోయారు.