తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఆసీస్​ ఆటగాడి 13 ఏళ్ల దాహం తీరింది - ఆసీస్​ ఆటగాడికి 13 ఏళ్ల దాహం తీరింది.!

ఆస్ట్రేలియా టెస్టు సారథి​ టిమ్​ పైన్​ ఎట్టకేలకు శతకం సాధించాడు. దాదాపు 13 ఏళ్లుగా ఫస్ట్​క్లాస్​ క్రికెట్లో సెంచరీ కోసం ఎదురు చూస్తోన్న ఈ ఆటగాడి కల నెరవేరింది.

ఆసీస్​ ఆటగాడికి 13 ఏళ్ల దాహం తీరింది.!

By

Published : Oct 13, 2019, 1:33 PM IST

Updated : Oct 13, 2019, 1:40 PM IST

ఒక శతకం కోసం దాదాపు 13 ఏళ్లు ఎదురు చూశాడు ఆసీస్ టెస్టు​ జట్టు కెప్టెన్​​ టిమ్​ పైన్. శనివారం పెర్త్​ వేదికగా జరిగిన షెఫీల్డ్​ షీల్డ్​ టోర్నీ ఫస్ట్​క్లాస్ మ్యాచ్​లో.. తన​ రెండో శతకాన్ని సాధించాడు. టస్మానియా జట్టు తరఫున బరిలోకి దిగిన టిమ్​.. 121 పరుగులు చేసి ఔటయ్యాడు. తాజా ప్రదర్శనపై కోచ్​ జస్టిన్​ లాంగర్​ హర్షం వ్యక్తం చేశాడు.

2006లో తొలిసారి దేశవాళీ క్రికెట్​లో పశ్చిమ ఆస్ట్రేలియాపై తన మొదటి సెంచరీ సాధించాడు టిమ్​. ఈ మ్యాచ్​లో 215 పరుగులతో సత్తా చాటాడు. ఇటీవల యాషెస్​లోనూ బరిలోకి దిగినా మూడంకెల స్కోరు అందుకోలేకపోయాడు.

ప్రతిష్టాత్మక యాషెస్​ సిరీస్​లో నిరాశపర్చిన వార్నర్​ ఈ టోర్నీలో శతకంతో రాణించగా.. మంచి ఫామ్​లో ఉన్న స్టీవ్​ స్మిత్​ డకౌట్ అవడం బాగా చర్చనీయాంశమైంది. స్మిత్​ పరుగులేమి చేయకుండా ఔటై దాదాపు మూడేళ్లవడం విశేషం.

Last Updated : Oct 13, 2019, 1:40 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details